Breaking News

సమస్యల పరిష్కారం కొరకు ఆగస్టు 2 న కలెక్టరేట్ ఎదుట ధర్నా ఫ్యాప్టో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ఫ్యాప్టో ఆగస్టు 2 వ తేదీ అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా నేటి సాయంత్రం కర్నూలు నగరంలో సలాం ఖాన్ భవనం యందు కర్నూలు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం నకు ముఖ్య అతిథులుగా ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ మరియు కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు, ఎ పి టి ఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షుడు ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.హృదయ రాజు  హాజరు కావడం జరిగింది.ఈ సమావేశం లో కాకి ప్రకాష్ రావు  మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రభుత్వం అధికారం లో వచ్చి సంవత్సరం దాటిన ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన అర్ధిక అంశాల పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొత్తగా ప్రమోషన్ మరియు బదలీ పొందిన ఉపాధ్యాయులకు రెండు నెలలు గా జీతాలు లేవు.ఈ విషయం లో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన వారిలో నిర్లక్ష్యం గా ఉన్నారు.ఈ నిర్లక్ష్యం పోవాలి అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలి రావాలని అన్నారు. హృదయ రాజు  మాట్లాడుతూ బోధన కు సమయం ఇవ్వకుండా బోధనేతర కార్యక్రమం లకు ప్రాధాన్యత ఇచ్చే విధానం లో అధికారుల ఆదేశాలు వస్తున్నాయి. బోధనకు సమయం ఇవ్వండి అని ఉపాధ్యాయులు అడగ వలసిన పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ బకాయిలు పి ఆర్ సి కమిటీ మరియు ఐ ఆర్ ప్రకటన ఇవ్వాలి అని డిమాండ్ లు నెరవేరాలి అందరూ కదలి రావాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశం కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సేవా లాల్ నాయక్ (ఆప్టా)అధ్యక్షత వహించారు. సెక్రటరీ జనరల్ జి.భాస్కర్(బి టి ఎ)కార్యదర్శి నివేదిక ను సమర్పించారు.ఈ సమావేశం యందు యు టి ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రవి కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి నవీన్ పాటిల్, ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు గోకారి మరియు ప్రధాన కార్యదర్శి జనార్ధన్, ఎ పి టి ఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి మరియానందం, ఆప్టా జిల్లా అధ్యక్షుడు మధు సూదన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ , డి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, బి టి ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి నందీశ్వరుడు మరియు ఇతర నాయకులు పాల్గొనటం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *