-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం నగర పరిధిలో గల ఇండోర్ స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్లు, జిమ్ లలో విజయవాడ నగర పాలక సంస్థ వారి చేత నియమితులైన కోచ్లనే ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ కోచ్ లు, లైఫ్ గార్డులు, జిమ్ కోచ్ లను తాత్కాలిక పద్ధతిపై నియమించుకొవాలని అన్నారు. బ్యాడ్మింటన్ కోచ్లకు నెలకు ₹20,000, లైఫ్ గాడ్ మరియు జిమ్ కోచిలకు నెలకు ₹15,000 గౌరవ వేతనముగా చెల్లించవలెనని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల స్పోర్ట్స్ విభాగంలో ఇద్దరు బ్యాట్మెంటన్ కోచులు, ముగ్గురు లైఫ్ గార్డ్ లు, ఒక జిమ్ కోచ్ అవసరమైనందున అర్హతకర నిరుద్యోగుల నుండి దరఖాస్తులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండి, 18 నుండి 40 సంవత్సరాల వయసు, బ్యాడ్మింటన్ కోచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఎన్ ఐ ఎస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, లైఫ్ గార్డ్ దరఖాస్తుదారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి లైఫ్ సేవింగ్ ఇన్ స్విమ్మింగ్ సర్టిఫికెట్ లేదా దాని సమాంతరం సర్టిఫికెట్ కలిగి ఉండాలని, జిమ్ కోచ్ దరఖాస్తుదారులకు బాడీ బిల్డింగ్ లో సర్టిఫికెట్ ఉండాలని, సంబంధిత పోస్టులకు మూడు సంవత్సరాల అనుభవం, జాతీయ/ రాష్ట్ర/ జిల్లా లెవెల్ పోటీలలో పాల్గొని ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అన్ని వివరములతో కూడిన బయోడేటాను తగు సర్టిఫికెట్లతో జతపరచి దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియము, బందర్ రోడ్డు నందుగల స్పోర్ట్స్ విభాగము నందు తేది.12-08-2025 సాయంత్రం 05.00 గం.లోపు వ్యక్తిగతము గా అందచేయవలసినదిగా తెలిపారు.
Prajavartha Online Telugu News