-ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దామోదరరావు, నరసయ్య విజ్ఞప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసిలో కొన్ని సంవత్సరాలుగా UTS TIMS ను అద్దె ప్రాతిపతికన E-BIX చైనా కంపెనీతో చేసుకున్న ఒప్పందం మేరకు సూమారు 14 వేలు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్లు(టిమ్సు) ఒక్కక్క “టిం” నెలకు రూః 680/- చొప్పున అద్దె చెల్లిస్తూ ఏడాదికి సుమారుగా రూః10 కోట్లు రూపాయలు పైబడి అద్దె చెల్లిస్తూ వినియోగిస్తున్నాము. ఈ “టిం” మెషిన్స్ చాల డిపోలలో చార్జింగు (బ్యాటరీ బ్యాక్ అప్) సరిగా వుండక పోవడం, స్క్రీన్ టచ్ పనిచేయక, మదర్ బోర్డు సమస్యలతో సరిగా పనిచేయక సిబ్బందికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ టీమ్సు వచ్చి కూడా మూడేళ్లు అవుతున్నాయి.ఈ “టిం” కు ఇచ్చే పేపర్ రోల్ కూడా నాసిరకం పేపర్ సప్లయి చేస్తూ వుండటంతో టికెట్లు ప్రింట్ సరిగా రావడంలేదని వీటన్నింటి వలన ఆగస్టు 15 నుండి ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపడుతున్న మహిళలకు ప్రీ బస్సు స్కీమ్ అమలు అయ్యేక బస్సుల్లో ఎక్కే ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్దితులలో ఇప్పుడు ఉన్న “టిం” లలో సింహభాగం కాలం చెల్లిన, పనిచేయని “టిమ్స్” ఉన్నాయి, ఇప్పటివరకు డ్యూటీలలో ఆకస్మాత్తుగా “టిం” పని చేయకపోతే మ్యాన్యువల్ గా టికెట్లు ఇచ్చే వారు, ఇప్పుడు ప్రీ టికెట్లకు అలా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి “టిం” ను మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఇబ్బందులు ఏదురవుతాయని ఈ ఇబ్బందులను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గురువారం ఆర్టీసి వి.సి & యం.డి ద్వారక తిరుమలరావు కి లేఖ ఇచ్చామని ఏపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఏపియస్ ఆర్టీసి లో “టిం” మెషిన్స్ అద్దెకు తీసుకొని సంవత్సరానికి పది కోట్లు చెల్లిస్తున్నా సరే ఈ టిమ్స్ రిపేర్సు వచ్చినా, డ్యామేజీలు అయినా ఆ డబ్బులు ఆర్టీసి కండక్టర్లు, డ్రైవర్లు, ఏడిసిల వద్ద వేలాది రూపాయలు రికవరీలు చేస్తున్నారని ఇది చాలా అన్యాయమని ఇ.యు నాయకులు తెలిపారు. ఇంత వరకు టిమ్స్ డ్యామేజీలపై చేసిన రికవరీ లను వెనక్కు చెల్లించాలని, ప్రస్తుతం “టిం” డ్యామేజీలపై ఇచ్చిన చార్జిషీట్లు అన్నీ వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో ఆర్టీసీ టిమ్స్ కు యస్.బి.ఐ బ్యాంకు వారు బ్యాంకు లోగో వేసుకొని టిమ్స్ ను, వాటికి సంబందించిన నాణ్యమైన పేపర్ రోల్స్ ను ఫ్రీగా ఇస్తున్నప్పటీకీ ఏపియస్ ఆర్టీసిలో ఆ ప్రయత్నాలు ఎందుకు చేయడంలేదని ప్రశ్నిస్తూ, ఏపియస్ ఆర్టీసికి కూడా టిమ్స్ ను డొనేట్ చేసే బ్యాంకుల ద్వారా, సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా ఇతర రాష్ట్రాల మాధిరిగా తీసుకొని ఆర్టీసి పై పడుతున్న ఆర్ధిక బారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అలాగే టిమ్స్ చార్జింగు తగ్గిపోతున్నందున ప్రస్తుతం వున్న అన్ని సిటి, ఆర్డినరి, ఎక్సుప్రెస్ బస్సులలో కొత్త BS-6 బస్సులలో వున్న విధంగా చార్జింగు పోయింట్లు పెట్టుకొనేలా చార్జింగు ఏర్పాటు చేయాలని ఇ.యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి.వి.నరసయ్యలు కోరారు.
Prajavartha Online Telugu News