Breaking News

సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి…

-వృద్ధులకు చేయూతనివ్వాలి.
-రక్తదానం మరొకరికి ప్రాణదానం కావాలి.
-ప్రాఫిట్ షూ కంపెని డైరెక్టర్ బోడేపూడి తేజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాఫిట్ షూ కంపెని అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ బి. ఎస్.కోటేశ్వరరావు జన్మదినోత్సవ సందర్భంగా గురువారం ప్రాఫిట్ షూ కంపెని ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ వాంబే కాలనీ లోగల అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఆశ్రమంలోని వృద్ధులకు చేయూతనిస్తూ వారికి కావలసిన నిత్యవసర సరుకులు మరియు ఆహారం, పండ్లను స్వయంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోడేపూడి తేజ మాట్లాడుతూ వృద్ధులను ఆదుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతని ఇలాంటి వృద్ధాశ్రమాలను ప్రతి ఒక్కరు సందర్శించి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే వృద్ధులందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అభిలషించారు. అంతకుముందు హనుమాన్ పేటలో కల ప్రాఫిట్ షూ కంపెని హెడ్ ఆఫీస్ లో ప్రాఫిట్ ఉద్యోగస్తులందరూ కలిసి విజయవాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాఫిట్ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్త దాతలను అభినందిస్తూ సర్టిఫికెట్ ప్రధానం చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ జిల్లా వైస్ సెక్రెటరీ డాక్టర్ వెలగా జోషి, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు చిట్టి బాబు హాజరయ్యారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ప్రాఫిట్ సంస్థ సమాజంలో ఎప్పుడూ తన బాధ్యతను గుర్తెరిగి సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం అభినందించదగ్గ విషయమని తెలిపారు. బి.ఎస్. కోటేశ్వరరావు అనాధ బాలల, వీధి బాలల రక్షణకు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ద్వారా ఎంతో కృషి చేశారని, చేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత బీఎస్ కోటేశ్వరావుకి రెడ్ క్రాస్ సంస్థ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. మరొక గౌరవ అతిథి చిట్టి బాబు  మాట్లాడుతూ సమాజ సేవకు ముందు ఉంటున్న ప్రాఫిట్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. తదనంతరం సంస్థ డైరెక్టర్ బోడేపూడి తేజ, డాక్టర్ వెలగా జోషి చిట్టి చిట్టిబాబు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డాక్టర్ మదన్మోహన్ చేతుల మీదుగా రక్త దాతలు అభినందిస్తూ సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రాఫిట్ షూ కంపెనీ సంస్థ సీనియర్ సిబ్బంది ఎస్ సతీష్, రాంబాబు,  భాస్కర రావు,  రాజేష్, శ్రీధర్, సురేష్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ ఆరవ.రమేష్, బర్డ్స్ సంస్థ సెక్రటరీ కోటే. ప్రకాష్ కుమార్, ప్రాఫిట్ షూ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *