Breaking News

జిల్లాలోని ఎఫ్.పి.ఓ లు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలి

-ఉద్యానవన పంటలు పండించుట లో అధిక ప్రాదాన్యత ఇవ్వాలి
-ఎఫ్.పి.ఓ లకు బ్యాంకుల రుణాలు, సబ్సిడీ ద్వారా అదునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విదాలుగా సహకారం అందించే దిశగా చర్యలు తిసుకు౦టున్నాం : జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ఎఫ్.పి.ఓ లు సంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలని, వారికి బ్యాంకుల రుణాలు, సబ్సిడీ ద్వారా అదునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విదాలుగా సహకారం అందించే దిశగా చర్యలు తిసుకు౦టున్నాం అని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ S. వెంకటేశ్వర్ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) అభివృద్ధి కొరకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం, అగ్రిస్టాక్ వర్క్ షాప్ ను వ్యవసాయ శాఖ మండల మరియు డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. వారి కార్యక్రమాలను మరియు ప్రభుత్వం నుంచి వారి అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాలను తెలుసుకుని, వారికీ తగుచర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయాన్ని రైతుకు లాభదాయకంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సంబందిత అధికారులను కోరారు. సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా డ్రోన్లను అధిక శాతం వినియోగించుకొవలన్నారు. రైతులు ఒకే రకమైన పంటలు పండించడమే కాకుండా చిరుదాన్యాల పంటలు పండించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎఫ్.పి.ఓ లు ప్రభుత్వ పాలసీలు వినియోగించుకొని ముందుకెల్లలన్నారు. జిల్లాలో కొత్త ఎఫ్.పి.ఓ లను ప్రోత్సహించాలి. జిల్లాలో వ్యవసాయ పంట కంటే కూడా ఉద్యాన పంటలు అధిక రాబడిని పొందుతున్నాయని, వ్యవసాయ, ఉద్యాన పంటలు రెండు కూడా ఒకే ఆదాయాన్ని గడించేలా అధికారులు చర్యలు తిసుకోవలన్నారు. ఆయిల్ ఫాం, ఆక్వా రంగంలో కూడా ఇటీవల మంచి రాబడులు వస్తున్నాయని, ఆక్వా రంగం వైపు రతులు దృష్టి పెట్టాలన్నారు.

అగ్రిస్టాక్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తీసుకువచ్చే నూతన వ్యవసాయ మార్పులపై వ్యవసాయ మరియు అనుబంద శాఖ అధికారులకు కార్యశాల (వర్క్ షాప్) నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేస్తూ .. అగ్రిస్టాక్ అనేది రైతు రిజిస్ట్రీ, జియో-రిఫరెన్స్ విలేజ్ మ్యాప్స్ మరియు క్రాప్ ఫోన్ రిజిస్టితో సహా ముఖ్య మైన వ్యవసాయ డేటాసెట్లను ఏకీకృతం చేసే సమాఖ్య అని అన్నారు. ఈ డేటాసెట్ లు యూనిపైడ్ పార్మర్ సర్వీస్ ఇంటర్ఫేస్ ద్వారా ఏకీకృతం చేయబడతాయని, బ్యాంకులు, బీమా సంస్థలు, వ్యవసాయ సాంకేతిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో మద్య సహావాటాదారులకు అనుమతిస్తుందన్నారు. అదే విదంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన సామర్థ్యాన్ని సజావుగా డేటా భాగస్వామ్యాన్ని అందిస్తుందని, బహుభాషా చాట్బాట్లు, ప్రెసిషన్ పార్మింగ్ టూల్స్, రియల్-టైమ్ అనలిటిక్స్,ఇమేజ్-బేస్డ్ పెస్ట్ డిసీజ్ డయాగ్నస్టిక్స్ వంటి అప్లికేషన్లు వ్యవసాయ పద్దతులను విప్లవాత్మకంగా మార్చగలవని తెలిపారు. ఈ రెండింటి కలయికతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉపయోగపడే సమస్త సమాచారంతో కూడిన సరికొత్త మొబైల్ ఇంటర్ఫేస్ ఏపీఏఐఎంఎస్ పేరుతో ఆవిష్కరించారన్నారు. ఇందులో ఇప్పటికే రైతులకు అందజేస్తున్న సేవలతోపాటు, పంటల పోటోలు మ్యాప్ చేయడం ద్వారా పంటకు సంబంధించిన తెగుళ్లు సమాచారం, అందుకు ఉపయోగించాల్సిన పిచికారి మందుల సమాచారం రైతులు నేరుగా తెలుసుకోవచ్చునన్నారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడమే గాక మార్కెటింగ్ సదుపాయాలు కూడా విస్తృతపరచుకోవచ్చునని తెలిపారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఎన్నెముకగా నిలవడమే కాకుండా, ఆహార భద్రత, ఉపాది, జీవనోపాధిని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయంలో ఆదునిక టెక్నాలజీను మేళవించి వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈ సమావేశంలో జిల్లావ్యవసాయాధికారి S.ప్రసాద రావు, జిల్లా హార్టికల్చ ర్అధికారి B.దశరధరామి రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి A.రవి కుమార్, LDM రవి కుమార్, సునీల్, DDM, NABARD, సతీష్ కుమార్, జిల్లా సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి, APMIP, శ్రీనివాసులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్, KVK, రాస్,  జగదీశ్, రీజనల్ మేనేజర్ SFAC, M. భాస్కరయ్య, DTC, DRC, రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు. వ్యవసాయ శాఖ ఏడీలు, ఏఓలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *