గంగూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ( మై భారత్) కృష్ణజిల్లా ఆధ్వర్యంలో గురువారం గంగూరులోని దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అవగాహన సదస్సు నిర్వహించారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మై భారత్ కృష్ణజిల్లా జిల్లా యువ అధికారి సుంకర రాము, విజయవాడ దూరదర్శన్ రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ షఫి మొహమ్మద్, దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ కడియాల రవి, ఇండియన్ బ్యాంకు కానురు శాఖ సీనియర్ మేనేజర్ ఎస్ సాఇ విజయేంద్ర, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పి ఉపేంద్ర గౌడ్, పొస్టల్ డిపార్టమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొలా వెంకటనారాయణ, డెవలప్మెంట్ ఆఫీసర్ పొస్టల్ డిపార్టమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ంగ్ ఎక్జ్యూకూటివ్ యమ్ చెంచెశ్వరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకి అవగాహన కల్పించారు
పథకాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి
కృష్ణా జిల్లా జిల్లా యువ అధికారి సుంకర రాము
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల అందరికీ అవగాహన ఉండాలని ముఖ్యంగా యువత క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేశంలోని పేద,మధ్యతరగతి వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనె లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అవగాహన కల్పిస్తుందన్నారు..
ప్రధాని మోడీ సంకల్పం, కృషి ద్వారా 140కి పైగా పథకాలను విజయవంతంగా అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వికసిత భారత్ సాధనలో డిజిటల్ ఇండియా పాత్ర
దూరదర్శన్ రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ షఫి మొహమ్మద్
2047 నాటికి వికసిత భారత్ సాకారం దిశగా డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తోందని దూరదర్శన్ రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ షఫి మొహమ్మద్ అన్నారు. UPI వల్ల దేశంలో డిజిటల్ లావాదేవీలు సులభతరం అయ్యాయని, ప్రపంచంలో అనేది దేశాలు UPI ను వాడుతున్నాయని తెలిపారు. అదే విధంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ఆధునీకరించబడిందని, దీని ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో సామర్థ్యం, ప్రభావం, పారదర్శకత మరియు జవాబుదారీతనం తెస్తుందని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ ద్వారా ప్రభుత్వ సంస్థల కొనుగోలు పక్రియ మరింత పారదర్శకంగా చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ పధకాల ద్వారా ప్రజలు అభివృద్ధి చెందాలి.
కడియాల రవి ప్రిన్సిపాల్
దేశంలోని 145 కోట్ల జనాభా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రత్యేక పధకాలను అమలు చేస్తోందని, వారి వారి అవసరాలకు అనుగుణంగా ప్రజలు ఆ పధకాలను వినియోగించుకోవాలని దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ కడియాల రవి కోరారు. ముఖ్యంగా యువత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగం కావాలన్నారు. యువత బాధ్యతగా తీసుకొని కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.. పట్టణాలతోపాటు, గ్రామీణ ప్రాంతంలో కూడా పథకాల గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు.
ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ఇండియన్ బ్యాంకు కానురు సీనియర్ మేనేజర్ ఎస్ సాఇ విజయేంద్ర
నేటి యువత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం సద్విని యోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని .ఇండియన్ బ్యాంకు కానురు సీనియర్ మేనేజర్ ఎస్ సాఇ విజయేంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ పధకం ద్వారా లబ్ధిదారులు సబ్సిడీని పొందవచ్చు అన్నారు. స్వయం ఉపాధి రంగాలకు, కుటీర చిన్న మధ్య తరహా పరిశ్రమల వాళ్ళు ఎంటర్ప్రైన్యూర్ లుగా ఎదిగే వాళ్ళు ముద్ర లోన్స్, మరియు పథకాల ద్వారా ఆర్థిక సాయం పొంది పారిశ్రామికవేత్తలుగా రాణించాలన్నారు.
దేశ యువత నైపుణ్యాభివృద్ధి పొందాలి
పిఐబి ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పి ఉపేంద్ర గౌడ్
దేశ యువత కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో భాగంగా అందించే వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక ప్రగతిని సాధించాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పి ఉపేంద్ర గౌడ్ కోరారు. ఇందులో భాగంగా ముఖ్యంగా దేశంలోని 40 కోట్ల మందికి వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్లు/డిప్లొమా ఉన్నవారికి విద్యానంతర ఉద్యోగ శిక్షణ అందించడం ద్వారా దేశంలో అప్రెంటిస్‌షిప్ అవకాశాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించబడిందని తెలిపారు.
ప్రజలు తపాలా శాఖ అందించే వివిధ పధకాలను సద్వినియోగం చేసుకోవాలి
పొస్టల్ డిపార్టమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొలా వెంకటనారాయణ
దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా తపాలా శాఖ అనేక పొదుపు పధకాలను అందిస్తోందని పొస్టల్ డిపార్టమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొలా వెంకటనారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా జీవిత భీమా విభాగంలో తపాలా శాఖ అనేక పధకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచిందని ఆయన ఆన్నారు. ప్రజలు ఈ పథకాలపై పూర్తి అవగాహన కల్పించుకుని వాటిలో పెట్టుబెడులు పెట్టాలని ఆయన కోరారు.
ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో ఉపయోగపడుతుంది
పొస్టల్ డిపార్టమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ మార్కెట్ంగ్ ఎక్జ్యూకూటివ్ యమ్ చెంచెశ్వరావు
తల్లిదండ్రులు తమ ఆడపిల్లల కోసం పొదుపు చేయడంలో సహాయపడటానికి ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం వారి ఆర్ధిక ప్రయోజనాలకు ఎంతగానో సహాయపడుతుందని యమ్ చెంచెశ్వరావు అన్నారు. ఈ పధకం ద్వారా ఆడపిల్లల విద్య మరియు వివాహం కోసం డబ్బును సేకరించవచ్చని ఆడపిల్లలకు 21 సంవత్సరాల వయస్సు వచ్చాక పొదుపు ఆ మొత్తం నేరుగా ఆమెకు చేరేవిధంగా ఉండడం వాళ్ళ ఆడపిల్లల భవిష్యత్తు అవసరాలకు ఈ పధకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలంతా ఈ పధకం లో పొదుపు చేయాలనీ కోరారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మరిన్ని ఆర్ధిక పొదుపు పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానంతరం జిల్లా యువ అధికారి సుంకర రాము కార్యశాలలో పాల్గొన్న అతిధులను సన్మానించి మేమోంటలను అందజేశారు
Prajavartha Online Telugu News