-హాజరైన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంగళవారం తుడా బోర్డు మీటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ వెంటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,తుడా సెక్రటరీ ఎన్వి శ్రీకాంత్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టౌన్ అండ్ సిటీ ప్లానింగ్ డైరెక్టర్ విద్యులత, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ శివయ్య, పురపాలక శాఖ మంత్రి ఓ ఎస్ డి భాస్కర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాదాపు 9 అంశాలను కీలకంగా చర్చించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశంతో తుడా పరిధిలో ఉన్న దాదాపు 20 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో మొదట విడతగా చెన్నైగుంట, మంగళం, శెట్టిపల్లి చెరువులను 8. 6 కోట్ల రూపాయలతో అభివృద్ధికి ఆమోదం తెలియజేశారు. సూరప్పకసం పద్మావతి నగర్ తుడా లేఔట్స్ నందు చదరపు గజం 14 వేల కనీస ధరగా నిర్ణయించి 13వ విడత వేలంకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.శెట్టిపల్లి శ్యాటిలైట్ టౌన్షిప్ కోసం ప్రతిపాదించిన ఐదు నూతన రోడ్ల నిర్మాణం ఆమోదం తెలియజేశారు. వీటితోపాటు మరికొన్ని కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Prajavartha Online Telugu News