Breaking News

కొత్తగా ఎన్నికైన కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌కు అభినంద‌నలు తెలిపిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

-నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేసినందుకు సీఎం చంద్ర‌బాబు కి ధ‌న్య‌వాదాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో నామినేటెడ్ పదవులను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 31కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించింది. ఈ చైర్మ‌న్ నియ‌యాకాల్లో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ముగ్గురికి అవ‌కాశం క‌ల్పించినందుకు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏపీ దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ గా నియ‌మితులైన నాగుల్ మీరా కు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏపీ నగరాల కార్పొరేషన్ చైర్మన్ గా నియ‌మితులైన మరుపిళ్ళ తిరుమలేశ్వర రావు కి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏపీ నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియ‌మితులైన ఎరుబోతు రామనారాయణ రావు కి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *