-అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గద్దె క్రాంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక 22వ డివిజన్ పరిధిలోని అన్నమ్మ తల్లి 28వ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ. 5 వేలు ఆర్థిక సహాయాన్ని గద్దె క్రాంతి ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా గొప్పది అన్నదానం అన్నారు. ఎదుటివారి ఆకలి తీర్చడంలో ఉండే సంతృప్తి మరి ఏ ఒక్కదాంట్లో ఉండదన్నారు. పండగలు ఉత్సవాల పేరుతో అన్నదానాలు నిర్వహించడం మంచి సాంప్రదాయమని, అన్నదానం నిర్వహించిన కమిటీ సభ్యులను గద్దె క్రాంతి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు విజ్జి సన్యాసిరావు, పెద్ది అన్నారావు, పెద్ది పెద్ద అన్నారావు, తాత సాంబయ్య, బత్తుల నాగేశ్వరావు, తోట శ్రీనివాస్, యాళ్ల దుర్గారావు, నడికోప్పుల శివ, రాంబాబు, కొండేటి వెంకట్రావు, రవి, టెంటు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News