Breaking News

2026 జూన్ 5 నాటికి ఎపిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యం

– ఆగష్టు 15 నుండి ఎపి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
– “సే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్” నినాదంతో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు
– ప్లాస్టిక్ కు బదులుగా స్టెయిన్ లెస్ స్టీల్,గాజు గాసులు ద్వారా తాగునీరు
– ఎపి సచివాలయంలో 4 అర్వో ప్లాంట్లు,32 బాటిల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు
– ఈనెల 18 నుండి ఎపి సచివాలయంలో గాజు,స్టీల్ బాటిళ్ళతోనే తాగునీరు
– వచ్చేనెల నుండి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకై ఇండెంట్ పెటొద్దు
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని2026 జూన్ 5ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్ణయించారు.అందుకు అనుగుణంగా ఈనెల 15వ తేదీన నుండి ఎపి సచివాలయంలో ” సే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్” అనే నినాదంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి మరీ ముఖ్యంగా మానవాళికి కలుగుతున్న నష్టం వర్ణణాతీతం.ఈనేపధ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది.దానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన రాష్ట్ర సచివాలయం నుండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి శ్రీకారం చుట్టడం ద్వారా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుంది.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమైఆగష్టు 15 నుండి ఎపి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యదర్శులతో విస్తృతంగా చర్చించారు.ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఒకసారి వాడి పడేసే(Single Use Plastic)వస్తువులకు సంబంధించి వివిధ క్యారీ బ్యాగులు,ప్లాస్టిక్ మంచినీటి సీసాలు,గ్లాసులు,ప్లేట్లు,కప్పులు,స్పూన్లు,పోర్కులు,ఫినాయిల్ సీసాలు,డబ్బాలు తదితర వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఎస్ విజయానంద్ కార్యదర్శులతో చర్చించారు.
ఆగష్టు 15 నుండి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని సిఆర్డిఏ,మెప్మా,స్వచ్ఛాంధ్ర,స్వర్ణాంధ్ర విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా అమలు జరిగేలా చూడాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.ఈనెల 18 నుండి ఎపి సచివాలయంలో గాజు గ్లాసులు,స్టెయిన్ లెస్ స్టీల్ బాటిళ్ళనే మంచినీరు తాగేందుకు వినియోగించాలని అన్ని శాఖల అధికారులు,ఉద్యోగులకు ఆయన స్పష్టం చేశారు.అన్ని శాఖల కార్యదర్శులతోపాటు ఆయా శాఖాధిపతులు కూడా వారి సిబ్బందికి సింగిల్ యూజ్ ప్లాస్టిస్ నిషేధంపై తగిన ఆదేశాలు జారీ చేసి సక్రమంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.రాష్ట్ర సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులతోపాటు సందర్శకులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్నిపాటించాలని చెప్పారు.ఇందుకు సంబంధించి సందర్శకులకు కొద్ది రోజులపాటు దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు సిఎస్ విజాయనంద్ సూచించారు.
కాగా నేడు ప్రపంచమంతా ప్లాస్టిక్ సంక్షోభాన్నిప్లాస్టిక్ కాలుష్యాన్నిఎదుర్కొంటోంది.శిలాజ ఇంధనాల వెలికితీత,ఉత్పత్తి,తయారీ,ఉపయోగం,రీసైక్లింగ్ మరియు పారవేయడం వంటి జీవితచక్రంలోని ప్రతి దశలో ప్లాస్టిక్‌లు ప్రజలను మరియు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి.జీవవైవిధ్యం ,వాతావరణ మార్పుమానవ ఆరోగ్యం మరియు మానవ హక్కులతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో దీని ప్రభావాలు కనిపిస్తాయి.ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి,మానవ ఆరోగ్యానికి అనేక నష్టాలు కలుగుతున్నాయి.ప్లాస్టిక్ భూమి,నీరు,గాలిని కలుషితం చేస్తుంది.అంతేకాకుండా జంతువులు,పక్షులు,మత్స్య సంపద మనుగడకు ముప్పు కలిగిస్తుంది.ముఖ్యంగాప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో పేరుకుపోయిసముద్ర జీవులకు హాని కలిగిస్తున్నాయి.ప్లాస్టిక్ నాసనం వడానికి వందల సంవత్సరాలు పడుతుందిఇది భూమినీరు మరియు గాలిని కలుషితం చేస్తుంది.ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరిసముద్ర జీవులకు హాని కలిగిస్తున్నాయి.వివిధ మత్స్య సంపద పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా తినివాటిలో విషం చేరిచనిపోతున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి.ప్లాస్టిక్ లోని రసాయనాలు ఆహారం మరియు నీటి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించిఅనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.ప్లాస్టిక్ జీవితచక్రం అంతటా, పీల్చడం, తినడం మరియు ప్రత్యక్ష చర్మ సంపర్కం ద్వారా మానవులు అనేక రకాల విషపూరిత రసాయనాలు మరియు మైక్రోప్లాస్టిక్‌లకు గురవుతారు.ప్లాస్టిక్ యొక్క ప్రతికూల ప్రభావాలు తీవ్రమైనవి ముఖ్యంగా గర్భంలో ఉన్న పిల్లలు అకాల పుట్టుక,ప్రసవం,పునరుత్పత్తి అవయవాల పుట్టుక లోపాలు,న్యూరో డెవలప్‌మెంటల్ బలహీనత,బలహీనమైన ఊపిరితిత్తుల పెరుగుదల మరియు బాల్య క్యాన్సర్ వంటిప్రమాదాలు పెరుగుతాయి.వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన వాతావరణ సంఘటనలతో సంబంధం ఉన్న అనేక ఆరోగ్య ప్రమాదాలకు ప్లాస్టిక్‌లు దోహదం చేస్తాయి.ప్లాస్టిక్ సంకలనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు కేవలం ప్లాస్టిక్ సంకలనాల వల్ల మాత్రమే కాకుండామైక్రోప్లాస్టిక్‌లు మరియు నానో-ప్లాస్టిక్‌ల రూపంలోని ప్లాస్టిక్ పదార్థాలకు మానవులు ప్రత్యక్షంగా గురవుతున్నారని పెరుగుతున్న ఆధారాలు సూచిస్తున్నాయి.ఇవివంధ్యత్వం,ఊబకాయం,మధుమేహం, ప్రోస్టేట్ లేదా రొమ్ము క్యాన్సర్,థైరాయిడ్ సమస్యలు మరియు హృదయ సంబంధ వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
అంతకు ముందు ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి గత నెలన్నర రోజులుగా చేస్తున్న ప్రత్యామ్నయ ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో 4 ఆర్పో ప్లాంట్లు,32 బాటిల్ డిస్పెన్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుండగా అవి శనివారం నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ఎపి సచివాలయంలో పని చేసే ప్రతి అధికారి,ఉద్యోగికి 750 మిల్లీ లీటర్ల గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ బాటిళ్ళను అందుకుబాటులో ఉంచడం జరుగుతుందని వాటితో వారు ఎప్పటికప్పుడు తాగునీరు అవసరాలను తీర్చుకుని వాటిని భద్రపర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.కాగా ప్రస్తుతం 250 మిల్లీ లీటర్ల కిన్లే తదితర బ్రాండ్ల ప్లాస్టిక్ మంచినీటి బాటిల్ ను 8రూ.లు వెచ్చించి సమకూర్చాల్సి వస్తోందని అదే గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ బాటిళ్ అయితే కేవలం 3రూ.లు ఖర్చవుతుందని వివరించారు.వచ్చే ఏడాది జూన్ 5 నాటికి ఎపిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ముందుగా రాష్ట్ర సచివాలయం మొదలు గ్రామ స్థాయి వరకూ అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఈఏడాది చివరి నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టికి నిషేధానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సురేశ్ కుమార్ వివరించారు.దీనిపై ఉద్యోగులు,ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దానిలో భాగంగా కరపత్రాలు,రీసైకలబుల్ ఫ్లెక్సీలను సచివాలయం అన్న బ్లాకుల్లో ఏర్పాటు చేశామని వివరించారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్,పిసిబి చైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు‌.అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా,కృష్ణబాబు,సిసిఎల్ఏ జయలక్ష్మి,జిఏడి ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా,హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,ముఖ్య కార్యదర్శి సునీత,సిఆర్డిడిఏ కమీషనర్ కె.కన్నబాబు తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *