-ఏలూరు ఆర్.టి.సి. బస్టాండ్ లో ఉచిత బస్సు పధకాన్ని ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి..
-ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్ లతో కలిసి పధకాన్ని ప్రారంభించిన మంత్రి పార్ధసారధి..
-కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జెడ్పి చైర్ పర్సన్ ఘంగా పద్మశ్రీ, ఆర్.టి.సి. జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు..
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు ఆర్.టి.సి. కొత్త బస్టాండ్ లో పండుగ వాతావరణంలో స్త్రీశక్తి ఉచిత బస్సు పధకం ప్రారంభమైయింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, స్త్రీశక్తి ఉచిత బస్సు పధకాన్ని ప్రారంభించారు. నూజివీడు వెళ్లే బస్సులో మంత్రి ప్రయాణం చేశారు. అదే విధంగా జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు, చింతలపూడి, నియోజకవర్గాలకు సంబంధించిన బస్సులను కూడా ఆయా ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళల బాగస్వామ్యం పెరగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో భాగంగా స్త్రీశక్తి ఉచిత బస్సు పధకాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేవలం ఆధార్ ఉంటే చాలు బస్సులో ప్రయాణించవచ్చని, ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొన్నారు. అన్ని వయస్సుల మహిళలు దీనికి అర్హులేనని, ఇందులో అనర్హులంటూ ఎవరూ లేరన్నారు. ముందుగా జిల్లాలవరకే ఈ పధకాన్ని అమలు చేయాలని అనుకున్నారని అయితే యువనేత నారా లోకేష్ బాబు పట్టుదలతో ఈ పధకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నో అర్ధిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సంక్షేమానికి మేమే ఆధ్యులమని గొప్పలు చెప్పిందని, సంపూర్ణ మధ్యపాన నిషేదమని చెప్పి కల్తీమద్యం తీసుకువచ్చి మహిళల మంగళసూత్రాలు తెంచారన్నారు. కూటమికి అందించిన విజయాన్ని బాధ్యతగా బావించి పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఏరాష్ట్రం కూడా పింఛన్ల పంపిణీలో మనకు దరిదాపుల్లో లేదన్నారు. ఎంత భారమైన కూటమి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. ప్రతిరోజు 35 వేల మంది మహిళలు జిల్లాలో ప్రయాణిస్తారన్నారు. ఉచిత బస్సు ప్రయాణంచేస్తున్నారనే చులకన భావన సిబ్బందిలో ఎంతమాత్రం ఉండకూడదని ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఆర్.టి.సి. సిబ్బందికి ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ స్త్రీశక్తి పధకం కింద మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో 190 బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించే అవకాశం ఉందన్నారు. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కేవలం ఆధారం కార్డు లేదా రాష్ట్ర ప్రభుత్వం చే జారీ చేయబడిన గుర్తింపు కార్డులతో ప్రయాణం చేయవచ్చన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ మహిళల సంక్షేమం టిడిపితోనే మొదలైయిందన్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మహిళలకిచ్చిన హామీని నిలబెట్టుకుని స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. తమ నియోజకవర్గంలో పాత సర్వీసులను పునరుద్ధరించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్నజెడ్పి చైర్ పర్సన్ ఘంగా పద్మశ్రీ, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, విజయవాడ ఆర్.టి.సి. రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు ప్రసంగించారు.
ఏలూరులో మహిళల ఉచిత బస్సును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా డ్రైవింగ్ చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉచిత ప్రయాణానికి జీరో ఫేర్ టిక్కెట్ తీసుకుని బస్సులో ప్రయాణం చేశారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి నూజివీడు బస్సులో మహిళలతోపాటు ప్రయాణం చేసివారి అభిప్రాయం తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్లపల్లి పార్ధసారధి, షెడ్యూల్ కులాల ఆర్ధిక సంస్ధ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, జిల్లా ప్రజారవాణా అధికారి షబ్నమ్, ఆర్.టి.సి. డిఎం బి. వాణి, డిఎస్పీ శ్రావణ్ కుమార్, పలువురు రవాణా, ఆర్.టి.సి. అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News