Breaking News

నగర పరిధిలోనే కాదు బుడమేరు కాలువ ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది. కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాల మేరకు రామారావు పాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ ఎల్ వి గ్రాండ్ వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కలు మరియు వ్యర్థాలను ఆదివారము ఉదయం ఇంజనీరింగ్ విభాగం తొలగించారు.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల బుడమేరు కాలువలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేస్తున్నప్పటికీ, బుడమేరు ప్రవాహంలో అంతరాయాన్ని గమనించారు ఇంజనీరింగ్ సిబ్బంది. బుడమేరు కాలువ మొత్తం డ్రోన్ ద్వారా అంతరాయం ఎక్కడ ఏర్పడిందో పరిశీలించగా, రామవరపాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ ఎల్ వి గ్రాండ్ వద్ద గుర్రపు డెక్క, వ్యర్ధాలు పేరుకుపోవడం గమనించి, బుడమేరు ప్రవాహంలో ఎటువంటి అంతరాయం రాకూడదని ఉద్దేశంతో లాంగ్ ఆర్మ్ ప్రోక్ లైనర్, జెసిబి లతో, పేరుకుపోయిన వ్యర్థాలను గొర్రెపు డక్కలను తొలగించారు. బుడమేరు, బందరు, ఏలూరు, రైవస్ కాలవలు నగర పరిధిలో ఉన్నప్పటికీ వాటి చిట్టచివరి స్థానం ఎక్కడున్న, అవి నగర పరిధి కాకపోయినా వాటి ద్వారా నగర పరిధిలో గల కాలవల్లో ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కాలువలు చిట్టచివరి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ పర్యవేక్షిస్తున్నారు కమిషనర్ ధ్యానచంద్ర. అందులో భాగంగా, కమిషనర్ ఆదేశాలను అనుసరిస్తూ విజయవాడ నగర పరిధిలో బుడమేరు ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకపోయినప్పటికీ, నగర పరిధి కాని ప్రాంతాలలో అంతరాయం ఉన్నందున, విజయవాడలో బుడమేరు నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున నగర పరిధి కాని ప్రాంతాలలో వ్యర్ధాలను తొలగించే చర్యలు తీసుకుంటున్న చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి,పర్యవేక్షణ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి. సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇంజనీర్స్ సింధూర ను కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు.

అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ కూడా పేరు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే కమిషనర్ ని సంప్రదించాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *