విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ,ఎస్టీ ఎంఎస్ఎంఈ లకు రావలసిన రాయితీలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ అసోసియేషన్ జేఏసీ, కన్వీనర్ ఈడుపు గంటి అనార్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్స రాలుగా రాయితీల విషయంలో జాప్యం జరుగుతుందని, అనేక యూనిట్లు మూసివేత దశలోకి వెళ్లిపోయాయి. వంద లాదిమంది మొదటి తరం పారిశ్రామి కవేత్తలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయారు. బ్యాంకు ఖాతాలు NPA లుగా మారాయని వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. కూటమి ప్రభుత్వం కూడా అశ్రద్ధ వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ హైర్ బసెస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ.650 కోట్లు రాయితీ లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చూడాలని పారిశ్రామిక వేత్తలకు రక్షణ చర్యలు తీసుకో వాలని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సబ్సిడీ నిలుపుదల వల్ల తమ మీద ఆధారపడ్డ కుటుం బాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని, సబ్సిడీలు లేకుండా పరిశ్రమలు నిలవని, ఎంఎస్ఎంఈ ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలే సామాగ్రాభివృద్ధికి వెన్నెముక అని దయచేసి కుటుంబాలను ఆదుకో వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగా కుమార్ పినమల, వెంకటేష్ ఉల్లి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎoట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News