-పశ్చిమ అభివృద్ధిపై సమీక్ష లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎ రవీంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పి 4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటిని ప్రగతి పథంలో నడిపించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి 4 పాలసీని అమలు చేస్తున్నారని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్, విజయవాడ వెస్ట్ ఎ రవీంద్రరావు అన్నారు. గురువారం ప్రభుత్వ అతిథి గృహం వద్ద గల ఆయన కార్యాలయంలో పశ్చిమ లోని పి 4 విధానంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆధ్వర్యంలోని సుజనా ప్రాజెక్ట్ సెంటర్ టీమ్ నేతృత్వంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కు చెందిన సభ్యులు స్పెషల్ ఆఫీసర్ రవీంద్రరావు తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ లో పి 4 అమలుపై చేపట్టవలసిన చర్యలు , నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలను గురించి చర్చించారు.
ఈ సందర్భంగా సుజనా ప్రాజెక్ట్ సెంటర్ టీమ్ సభ్యులు ఉదయ్ కుమార్ ,నారాయణ మూర్తి మాట్లాడుతూ పశ్చిమ లోని పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎం ఎల్ ఎ సుజనా చౌదరి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారన్నారు. జీరో పావర్టీ, పి 4 , పశ్చిమ నియోజకవర్గ విజన్ ప్లాన్ వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి సహకారంతో ఎం ఎల్ ఎ సుజనా సమిష్టిగా అమలు చేయనున్నారని త్వరలోనే కార్యరూపం దాల్చనుందన్నారు. పి 4 టీమ్ కు , సుజనా ప్రాజెక్ట్ సెంటర్ టీమ్ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి 4 పాలసీని అమలు చేస్తున్నారని అందరం సమిష్టిగా విజయవంతం చేద్దామని స్పెషల్ ఆఫీసర్ రవీంద్రరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్, యంగ్ ప్రొఫెషనల్ కాకర్ల ప్రేమ్ దీప్, సుజనా ప్రాజెక్ట్ సెంటర్ టీమ్ సభ్యులు , రిటైర్డ్ ఇంజనీర్లు ఉదయ్ కుమార్, నారాయణమూర్తి, డాక్టర్ శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News