విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రవాసాంధ్రులు బిజెపి నాయకులు గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (జిసిటి) ద్వారా విజయవాడ భవానిపురం లోని ఎస్ కె సి వి ట్రస్ట్ లో అనాథ బాల విద్యార్థుల ఆశ్రమంలో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కటిక రాకేష్ నాథ్ చేతుల మీదుగా ఎస్ కె సి వి ట్రస్ట్ లో అనాథ బాల విద్యార్థుల కోసం అన్నదానం జరిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేకును కట్ చేసి వారికి తినిపించారు, మరియు వారికి అవసరమైన పుస్తకాలను పెన్నులను, బ్రెడ్, పండ్లను వారికి అందజేసారు.
Prajavartha Online Telugu News