-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జనరల్ సెక్రెటరీ కోలపల్లి గణేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ లో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయాలన్న సంకల్పంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ వీ ఎన్ మాధవ్ ప్రారంభించిన “సారథ్యం” రాష్ట్ర పర్యటన ఈ నెల 5 న శుక్రవారం విజయవాడ , పశ్చిమ నియోజకవర్గంలో కి ప్రవేశిస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ వీ ఎన్ మాధవ్ నాయకత్వంలో జరుగుతున్న జైత్రయాత్ర ను ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సవాల్ గా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు కార్యక్రమాన్ని నిర్వహించారు..
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జనరల్ సెక్రెటరీ కోలపల్లి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, బీజేపీ నాయకులు నున్న కృష్ణ, పట్నాయక్ ,పోతిన భేసు కంటేశ్వరుడు, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, పశ్చిమ లోని బీజేపీ మండల అధ్యక్షులు , బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జనరల్ సెక్రటరీ కోలపల్లి గణేష్ మాట్లాడుతూ బీజేపీ ని కిందిస్థాయి నుండి బలోపేతం చేయడానికి సారధ్యం పేరుతో కడప నుంచి రాష్ట్ర పర్యటనకు బయలుదేరిన ఈ జైత్రయాత్ర అన్ని జిల్లాలను పూర్తి చేసి ఈనెల 5 న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోకి ప్రవేశిస్తుందని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందో తెలియజేస్తూ “సారధ్యం” ప్రచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీ వీ ఎన్ మాధవ్ ఏపీ లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారన్నారు . కడపలో మొదలైన ఈ సారధ్యం కార్యక్రమం ఈ నెల 5 వ తేదీన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోకి ప్రవేశిస్తుందని బీజేపీ నేతలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పగడాల కృష్ణ,దేవిన హరిప్రసాద్ , సత్యసాయి ప్రసాద్, యలకల అనిల్, కనిశెట్టి లక్ష్మణరావు, కొమర కిరణ్, రెడ్డిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News