Breaking News

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీ మాధవ్ కి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి, నైతిక అర్హత లేదు…

-ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకుల తొత్తులుగా వ్యవహరించిన సావర్కర్ వారసులు, జాతీయ జెండాను తిరస్కరించి అవమానించిన ఆరెస్సెస్ వారసులు నేడు దేశం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అన్నారు.

రాహుల్ గాంధీ బీహార్ రాష్ట్రంలో చేపట్టిన “ఓట్ చోర్ గద్దే చోడ్” యాత్ర విజయవంతం అవడాన్ని జీర్ణించుకోలేని బిజెపి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తల్లిని కించపరిచారని కొత్త రకం దుష్ప్రచారానికి నాటకానికి తెరలేపిందన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ దేశంలో ఎన్నికల కమిషన్ బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తూ బిజెపి ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్లను చోరీ చేస్తుందని 16 రోజులుగా బీహార్ రాష్ట్రంలో పలు జిల్లాలలో “ఓట్ చోర్ గద్దే చోడ్ ” యాత్రను చేపడుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ యాత్ర ద్వారా దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓట్లను ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక పథకం ప్రకారం దోపిడీ చేస్తున్నారు అనే అంశంపై సాక్షాదారాలతో పత్రిక ముఖంగా బహిర్గతం చేశారన్నారు. రాహుల్ గాంధీ బిజెపి చేస్తున్న ఓట్ చోర్ అంశాన్ని దేశ ప్రజలకు బహిరంగ ర్యాలీల ద్వారా సభల ద్వారా తెలియపరచడం భారతీయ జనతా పార్టీకి మింగుడు పడటం లేదని అందుకే కొత్తగా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తల్లిని తూలనాడాడని కొత్త రకం దుష్ఫ్రచారాన్ని దేశ ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా “ఓట్ చోర్ గద్దే చోడ్ ” అంశాన్ని డైవర్ట్ చేయాలనే దురుద్దేశంతో బిజెపి అనుకూల చెంచా మీడియాలతో సోషల్ మీడియాలతో దుష్ప్రచారానికి తెరలేపిందన్నారు.

దేశంలో బిజెపి నీచ రాజకీయాలకు దోపిలకు దుర్మార్గాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బిజెపి దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే కంకణం కట్టుకుందని అందుకు నిదర్శనమే దేశంలోని నలుమూలల మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో అల్లర్లు జరుగుతున్నాయని ఒకపక్కన అల్లర్లతో మరోపక్క ఆర్థిక దోపిడీలతో దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు దోచిపెడుతుందని అన్నారు. నాటి బ్రిటిష్ పాలకులకు నేటి భారతీయ జనతా పార్టీ పాలకులకు ఎలాంటి తేడా లేదని నాడు బ్రిటిష్ పాలకులు విభజించి పాలిస్తే నేడు బిజెపి నాయకులు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశంలో భాష ప్రాంతం మతం కులం అని విభేదాలు సృష్టించి నీచ రాజకీయ లబ్ది పొందుతున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *