Breaking News

ఈనెల 10 వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంగళవారం రోజు ఈనెల 10 వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పి.నారాయణ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, తదితరులతో సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కడప రీజినల్ ఏపీఎస్ఆర్టీసీ చైర్ పర్సన్ పూల నాగరాజు, జోన్4 కడప ఏపీఎస్ఆర్టీసీ ఈడి చంద్రశేఖర్, డిటిసి వీర్రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, డిప్యూటీ కమిషనర్ పావని, మెప్మా పిడి విశ్వజ్యోతి, నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *