-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లను సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ డిప్యూటీ ఎస్పి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, విశాఖపట్నం వారు సూచించిన మేరకు కోస్టల్ పోలీస్ స్టేషన్ దుగ్గరాజు పట్నం కు సంబంధించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మరమ్మత్తులకు, కాంపౌండ్ వాల్ నిర్మాణం అంశాలకు సంబంధించి నిధులను అందుబాటు మేరకు పరిశీలించి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తమ వెంట ఆధార్ కార్డు, బయోమెట్రిక్ కార్డు తీసుకొని వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని జిల్లా మత్స్య శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తూపిలి పాలెం దుగ్గరాజపట్నం బీచ్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మెరైన్ పోలీసు అధికారులకు సూచిస్తూ దానికి అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన బోట్లు గుర్తించడానికి వాటికి నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా మత్స్య శాఖ వారు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అవసరం మేరకు సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. తమిళనాడు నుండి మత్స్యకారులు మెకనైజడ్డ్ బోట్లతో అక్రమంగా మన వైపు ఉన్న సముద్ర జలాల్లో చేపలు పట్టడం జరుగుతోందని అధికారులు తెలుపగా సదరు అంశం ప్రభుత్వం దృష్టికి పరిష్కార దిశగా తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో స్పెషల్ బ్రాoచ్ డిప్యూటీ ఎస్పీ జె వెంకటరమణ, డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ జి. బాలిరెడ్డి, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ తిరుపతి అసిస్టెంట్ కమీషనర్ కె. విజయ కుమార్, కోస్ట్ గార్డ్ అధికారి పీ కే సురేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, మెరైన్ పోలీస్ అధికారులు మాలకొండయ్య, అంజి రెడ్డి, కృష్ణపట్నం పోర్ట్ కన్జర్వేటర్ బివిఎల్ నరసింహులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News