-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి/ వెలగపూడి సచివాలయం, నేటి పత్రిక ప్రజావార్త :
డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైం టీచర్లు ఆందోళన చెందవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ భర్తీ చేసి రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించడంతో తమ ఉద్యోగాలకు భద్రత లేదని పలువురు పార్ట్ టైం టీచర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంత్రి డా.స్వామి స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…..డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైం టీచర్లు ఎవరు ఆందోళన చెందవద్దు, అందరినీ సర్దుబాటు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
Prajavartha Online Telugu News