Breaking News

మకుట శ్రీ గోల్డ్ & డైమండ్ షోరూం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఈషా రెబ్బ ఆనందం వ్యక్తం చేశారు. మకుట శ్రీ గోల్డెన్ డైమండ్స్‌లో 2 గ్రాముల నెక్లెస్ దగ్గర నుండి 200 గ్రాముల హారం వరకు అన్ని రకాల అభరణాలు దొరుకుతాయని అన్నారు. విజయవాడ నగరంలో శుక్రవారం గవర్నర్‌పేటలోని జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మగుడశ్రీ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్‌ను ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్ మరియు ఈషా రెబ్బ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్లు రిబ్బన్ కట్ చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. తమ చేతుల మీదుగా షోరూమ్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, విజయవాడ అంటే తమకెంతో మక్కువ అని ఈ సందర్భంగా హీరోయిన్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం షోరూమ్‌ను సందర్శించిన తారలు, ఆభరణాల తయారీ విధానాన్ని మరియు ధరలను అడిగి తెలుసుకున్నారు. షోరూమ్ నిర్వాహకులు వెంకట నాగ అరవింద్ మాట్లాడుతూ ఎవరూ ఇవ్వని విధంగా ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, చోకర్లు మరియు గొలుసులపై 1.99% వేస్టేజీ, ప్లెయిన్ జ్యువెలరీపై 2.99% వేస్టేజీ, మరియు 100% జ్యువెలరీని స్టోన్ మైనస్ చేసి 5.99% వేస్టేజీకే ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఇతర ఆభరణాలను కూడా ప్లస్ 5.99% వేస్టేజీకే అమ్మటం జరుగుతుందని పేర్కొన్నారు. మకుట శ్రీ గోల్డెన్ డైమండ్స్‌లో 2 గ్రాముల నెక్లెస్ దగ్గర నుండి 200 గ్రాముల హారం వరకు, పచ్చి, కుందన్, నక్షి, బాంబే ఆంటిక్, హైదరాబాద్ ఆంటిక్ వంటి A టు Z ఫ్యాన్సీ డిజైన్స్‌తో సహా అన్ని రకాల జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు జగన్మోహన్రావు,, వెంకట ఆనంద్,పి సుబ్బు, శివ సురేంద్రబాబు, అన్నం ఆదిత్య వర్ష తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *