పాలకవర్గ సభ్యులు సొసైటీలలో పారదర్శకంగా పని చేయాలి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్య సహకార సంఘాలలో పాలకవర్గ సభ్యులు పారదర్శకంగా నిజాయితీగా పనిచేయాలని సొసైటీకు సంబంధించిన డబ్బులు విషంతో సమానమని భావించి పదివీకాలంలో నిక్కచ్చిగా ఉండి నోరు లేని నిరుపేద మత్స్యకారులకు అండగా ఉండి మేలు చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు.
బుధవారం మచిలీపట్నం మలకాపట్నంలో కృష్ణాజిల్లా మత్స్యశాఖ, జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలంలో ఇటీవల ఎన్నికైన పల్లె తుమ్మలపాలెం శ్రీరామ మెరైన్ మత్స్య సహకార సంఘం లిమిటెడ్ కు చెందిన పాలకవర్గ సభ్యుల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అభిమతం అని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మత్స్య కారుడికి అందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్క మత్స్యకారుడు మత్స్య సహకార సొసైటీ లలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 250 ఎకరాలకు దిగువ లోపున చేపల చెరువులను ప్రభుత్వం ఏ ఒక్కరికి కట్టబెట్టదని, ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ఉన్నంతకాలం బీ సి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అనుకూలంగా ఉంటారని ఇది తన హామీ అని మంత్రి పేర్ని నాని అన్నారు. పదవి నుంచి వైదొలిగినప్పటికీ మన గురించి పదిమంది మంచిగా చెప్పుకొనేలా పదవీ బాధ్యతలు నిర్వహించాలని కోరారు. గతంతో సరిపోల్చితే, గతంతో సరిపోల్చితే , ప్రస్తుతం మత్స్య కార గ్రామాలలో గణనీయమైన మార్పు కనబడుతుందని , ఎందరో తాగుడు వ్యసనం నుంచి విముక్తులయ్యారాని కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటూ తమ పిల్లలను చదివించుకొంటున్నారని, అక్కడడక్కడ కాపుసారా కాస్తున్నవారు కనబడుతున్నారని ఆ తరహా అక్రమ సంపాదన నిలువదని నిరుపేదల ఉసురు తగులుతుందని అన్నారు.
అనంతరం పల్లె తుమ్మలపాలెం శ్రీరామ మెరైన్ మత్స్య సహకార సంఘం లిమిటెడ్ కు చెందిన అధ్యక్షుడు మోకా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెన్నయ్య, కార్యదర్శి వడగు రమేష్, డైరక్టర్లు వడగు వెంకటేశ్వరరావులు, కొక్కిలిగడ్డ బ్రహ్మం, విశ్వనాథపల్లి భాస్కరరావు, నడకుదిటి కృపారావు, తిరుమలశెట్టి వెంకట దుర్గారావు తదితర పాలకవర్గ సభ్యులను మంత్రి అభినందిచి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మచిలీపట్నం మాజీ జెడ్ పి టీ సి లంకె వెంకటేశ్వరావు ( ఎల్వీయార్ ) , కృష్ణాజిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ యాకూబ్ బాషా , కృష్ణాజిల్లా మత్స్య సహకార సొసైటీ అధ్యక్షలు డాక్టర్ గోవింద్, మచిలీపట్నం మునిసిపల్ మాజీ వైస్ ఛైర్మెన్ బలగం విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *