Breaking News

నగరంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నందు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నందు నూతనంగా అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన లామినార్ (మాడ్యులర్) ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించారు. శనివారం సూర్యారావుపేట, పుష్పా హోటల్ సెంటర్ లోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నందు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ ప్రారంభించగా, జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర పార్లమెంటరీ అధ్యక్షులు అమ్మిశెట్టి వాసు మరియు అనిల్, సూర్యారావుపేట కార్పొరేటర్, టిడిపి ఫ్లోర్ లీడర్ ఎన్.బాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అత్యాధునిక సేవలు అందచేయటానికి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుచేసిన నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ద్వారా లబ్ది పొందిన వారితో సంభాషించారు. ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ మేనేజర్ వెంకట్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, ఈఎస్ఐ, ఎఫ్సీఐ, రైల్వే ఎస్ బి ఐ, అన్ని కార్పొరేట్ ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి అన్ని రకాల కంటి వైద్య సేవలు అందిస్తున్నట్టుగా తెలియజేసారు. కంటికి సంబంధించి ఎటువంటి ఆపరేషన్ అయిన పైన పొందుపరిచిన క్యాష్ లేస్ సదుపాయాలు అందరూ వినియోగించుకోవలసిందిగా హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది పైగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్ చేయించుకున్న లబ్దిదారులు పాల్గొని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, చికిత్స పొందిన లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *