విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివాసీ మేధావుల వేదిక ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ బిర్సాముండా 150 వ జయంతి జన జాతీయ గౌరవ దివస్ రాష్ట్ర సదస్సును ఈరోజు నిర్వహించడం జరిగింది. బిర్సాముండా వారసులుగా వారి స్పూర్తితో ఆయన ఆశయాలు కొనసాగించటానికి ఆదివాసీ మేధావుల వేదిక రాష్ట్ర కార్యాలయంలో నేడు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది, నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శోభ పితంబర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలుగా పొట్లూరి లక్ష్మయ్య, పూజారి రామ నాగేశ్వరరావు, కార్యదర్శిలుగా మండల గిరిదరరావుతో పాటు మొత్తం 15 మందితో నూతన కమిటీ రూపుదిద్దుకుంది. ఆదివాసీ మేధావుల వేదిక (ట్రైబల్ ఇంటలేక్సువల్స్ ఫోరమ్)కు అనుబందంగా ట్రైబల్ ఎంప్లాయీస్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులుగా దాసు శ్రీనివాసరావు, ట్రైబల్ సోషల్ మీడియా ఫోరమ్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా బండి వెంకటేశ్వర్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Prajavartha Online Telugu News