-కార్తీక దశ సహస్ర దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేశినేని జానకి లక్ష్మీ హాజరు
-అంగరంగ వైభవంగా కృష్ణా పుష్కర్ ఘాట్ (రామ్ లల్లా మైదాన్ ) లో దీపోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరమశివుని దివ్యాశీస్సులు కోసం నిర్వహించిన కార్తీక దశ సహస్ర దీపోత్సవం కన్నుల పండువగా వుందని, దీప కాంతుల్లో కృష్టనదికి సరికొత్త శోభ సంతరించుకుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ అన్నారు.
కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శారద సనత్చంద్ర పురోహిత కార్యాలయం నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్తీక దశ సహస్ర దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేశినేని జానకి లక్ష్మీ పాల్గొన్నారు.
కృష్ణలంక పోస్టాఫీస్ రోడ్డు చివర, కుర్తాళం పీఠం సమీపాన కృష్ణా పుష్కర్ ఘాట్ (రామ్ లల్లా మైదాన్ ) నందు జరిగిన కార్తీక దశ సహస్ర దీపోత్సవం కార్యక్రమాన్ని కేశినేని జానకి లక్ష్మీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి సామూహిక పూజలో పాల్గొన్నారు. అలాగే చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శను ఆసక్తిగా తిలకించారు. దీపోత్సవానికి వచ్చిన మహిళలు, యువతులు ఓంకారనాదాలు, వేద మంత్రాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
ఈ సందర్బంగాం కేశినేని జానకి లక్ష్మీ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వహకులకు అభినందనలు తెలిపారు. పురాణ కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను చిన్నారులకు తల్లిదండ్రులు నేర్పించాలని సూచించారు. వేలాది దీపాల కాంతులతో కృష్ణా పుష్కర్ ఘాట్ ప్రాంతంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Prajavartha Online Telugu News