Breaking News

అర్హులైన కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం పార్టీ భేదాలు లేకుండా తక్షణమే సహాయం అందింస్తుంది…

-MLA బొండా ఉమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం 30 డివిజన్ కు చెందిన పలువురికి ₹9 లక్షల 19వేల రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలోని కాక రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం LOC & CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూటమి నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు  నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంతోమంది నిరుపేదలకు ఆపన్న హస్తంగా ఈ సహాయం అందించగలుగుతున్నామన్నారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాలతో వైద్యం పేదలకు అందని ద్రాక్ష లాగా మారిందని, ప్రభుత్వ వైద్యం పేదలకు దూరం చేయడంతో పాటు ప్రైవేటు కార్పొరేట్ వైద్యాన్ని అతి ఖరీదైన వైద్యంగా తయారు చేయడమే కాకుండా వ్యక్తిగత సులాభం కోసం వారిని ప్రోత్సహించి సామాన్యులకు పేదలకు  ప్రైవేటు వైద్యం అందుబాటులో లేకుండా భారీగా ఖరీదైన వైద్యంగా తయారు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కీలకపాత్ర వహించిందన్నారు. ఆనాడు 2014 నుండి 2019 వరకు ప్రభుత్వ వైద్యశాలలు డివిజన్ పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలు అనేక రకాలైన వైద్యాలకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను ఇచ్చి వారి ఆరోగ్య బాగోవులను చూసుకున్న ప్రభుత్వం చంద్రబాబునాయుడు ప్రభుత్వం అని తాను ఆనాడు ఎమ్మెల్యే గా ఉండి సెంట్రల్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేపించుకున్న వేలాదిమందికి కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి గా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులను అధునాతనమైన పరికరాలతో మంచి వైద్యం అందించడమే కాకుండా డివిజన్ల స్థాయిలో ఉన్న 14 ప్రాథమిక వైద్యశాలలలో  ఉన్నతమైన డాక్టర్లను నియమించి పూర్తి స్టాఫ్ ను ఏర్పాటు చేసి ఉచితముగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తూ  ప్రాథమిక వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామని, అదేవిధంగా కార్పొరేట్ వైద్యశాలలలో, ప్రైవేటు వైద్యశాలలలో, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలలో అనారోగ్యానికి గురై వైద్యం చేపించుకొన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్న వారి అందరికీ సీఎం సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో చెక్కులను ఇస్తూ వారిని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదుకుంటూ ఉన్నానని భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని సెంట్రల్ నియోజకవర్గం లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను, కార్పొరేషన్ పరంగా ఉన్న వైద్యశాలలను అభివృద్ధి చేసి అందరికీ ఆరోగ్యకరమైన మంచి వైద్యాన్ని అందించెందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 30వ డివిజన్ అధ్యక్షులు లక్కం రాజు శ్రీనివాస్ రాజు, ఇంచార్జ్ కరణం వెంకటరమణ తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *