గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు శ్రీ సత్య సాయి బాబా చేసిన సేవలను స్మరించుకుంటూ, వారు చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ సర్త్య సాయి బాబా జయంతి వేడుకలను ఎంతో ఘంగా నిర్వహిస్తూ, ఆయన చేసిన సేవలను మరియు ఆధ్యాత్మికతను కోట్ల మంది ప్రజలు స్మరించుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ఆయన మన రాష్ట్రంలో వెనుకబడిన రాయల సీమ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఎన్నో గ్రామాలకు త్రాగు నీటి సరఫరా, విద్య, వైద్య సేవలను అందించారని తెలియచేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏంతో మంది ప్రజలు ఆయన చూపిన సేవ మరియు ఆధ్యత్మిక మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కావున ప్రజలు కూడా వారిని స్పూర్తి గా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని తెలియచేశారు.
కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పోరేటర్లు ఈరంటి వరప్రసాద్, వేముల జ్యోతి పద్మజ, ఇర్రి ధనలక్ష్మి, సాదు రాజేష్, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, మేనేజర్ బాలాజీ బాషా, పి.ఓ సింహాచలం, వివిధ విభాగాల సూపరిండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News