Breaking News

కలెక్టరేట్ లో ఘనంగా శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి శ్రీ సత్యసాయి చిత్రపటానికి పూల మాలలు అలంకరించి విశ్వశాంతి, సౌభాగ్యం, మానవాళి సుఖసంతోషాల కోసం పరితపించిన ప్రేమ వారధిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి మానవతా విలువల పరిమళాలను నలుదిశలా వ్యాపింపజేసిన స్ఫూర్తి సారథి శ్రీ సత్యసాయి అని పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఎనలేని సేవ చేసిన శ్రీ సత్యసాయిబాబా అందించిన స్పూర్తితో యువత ముందడుగు వేయాలన్నారు. సేవా మార్గంలో పయనిస్తూ భావితరాలకు మార్గదర్శకులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *