Breaking News

సమస్య పరిష్కారంలో ఉదాసీనతను విడనాడండి…

-నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారులు ఉదాసీనతను విడనాడాలని ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చిత్తశుద్దితో సమస్యలను పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను హెచ్చరించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ప్రజల సమస్యల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల జీవితాలతో ముడిపడిన అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించడంలో ఉదాసీనతను విడనాడాలని త్రికరణ శుద్దితో ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కార మార్గం చూపడం ద్వారా ఆర్జీదారుడు పిజిఆర్ఎస్పై పెట్టుకున్న ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేయాలన్నారు. ఆర్జీలకు ఎండార్స్మెంట్ నెంబర్ ఇచ్చి పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని, అర్జీలను సరైన విధంగా పరిష్కరించలేనంత సమయం ఉండి కూడా దృష్టి పెట్టడం లేదని రోజులో ఒక్క గంట అర్జీల పరిష్కారంపై దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు వచ్చి, ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రజల్లో సుపరిపాలనపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. అర్జీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు అర్జీదారుడు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలని సమస్య పరిష్కారంలో కింది స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని, అలసత్వం, అర్జీదారుడు పడుతున్న ఇబ్బందులు వంటి వాటిని క్షుణ్నంగా పరిశీలించి సాధ్యమైనంతవరకు జిల్లా అధికారుల స్థాయిలోనే పరిష్కారం చూపాలన్నారు. ఈ విషయంలో ఎద్కెనా ఇబ్బంది ఉంటే ఆర్జీలో నమోదు చేసి తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటానని. కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

పిజిఆర్ఎస్ ద్వారా మొత్తం 182 ఆర్జీలు స్వీకరించగా వీటిలో రెవెన్యూ శాఖ 53, మున్సిపల్ 31, పోలీస్ 18, పంచాయతీరాజ్ 8, విద్య శాఖ 8, విద్యుత్ 7, విభిన్న ప్రతిభావంతులు 6, సర్వే 6, రవాణ 6, డిఆర్డిఏ 5, వైద్య ఆర్యోగ 5, హౌసింగ్ 3, అర్అండ్ బి 3, కో- ఆపరేటివ్ 2, సాంకేతిక విద్య 2, దేవాదాయ 2, సాంఘీక సంక్షేమం 2, మత్స్య, కార్మిక, డ్వామా, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, బిసి వెల్ఫేర్, పొల్యూషన్, ఎపిఐఐసి, ట్రజరీ, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ, గునులు, బ్యాంకుకు సంబంధించి ఒక్కొక్క ఆర్జీ స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి. జ్యోతి, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, ఏసీపీ కె. వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *