-రాష్ట్ర బీసీ సంక్షేమ శాక మంత్రి సవిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు మరుపిళ్ల తిరుమలేశ్వరరావు (తిరుమలేశ్) అకాల మరణం అటు పేదలకు, టీడీపీకి తీరని లోటు అని, పేదలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్వరరావు కన్నుమూసిన విషయం విధితమే. శుక్రవారం విజయవాడ నగరంలో ఉన్న మరుపిళ్ల తిరుమలేశ్వరరావు కుటుంబ సభ్యులను మంత్రి సవిత పరామర్శించారు. తిరుమలేశ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తిరుమలేశ్ అకాల మరణం టీడీపీకి తీరని నష్టమని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల అభ్యున్నతి కోసం చివరి వరకూ తిరుమలేశ్ కృషి చేశారని కొనియాడారన్నారు. తిరుమలరావు మరణం కేవలం ఆయన కుటుంబానికే కాకుండా పేదలకు కూడా తీవ్ర ఆవేదన మిగిల్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ వెంట వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకటగురుమూర్తి, డూండీ రాకేశ్, పేరేపి ఈశ్వర్, బ్రహ్మ చౌదరి, యాటగిరి రాంప్రసాద్, యర్రబోతు రమణారావు, పలువురు డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Prajavartha Online Telugu News