Breaking News

43వ డివిజ‌న్ టిడిపి నూత‌న కార్యాల‌యాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం తెలుగు దేశం పార్టీ కార్యాల‌యాన్ని త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉర్మిళా న‌గ‌ర్ లో 43వ డివిజన్ తెలుగుదేశంపార్టీ నూతన కార్యాలయాన్ని మంగ‌ళ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్, రాష్ట్ర దూదేకుల కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా తో ప్రారంభించారు. అనంత‌రం పార్టీ కార్యాల‌యంలో దివంగ‌త‌నేత మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా అంటూ.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం లో క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం, గాంధీ హిల్ అభివృద్ది చేయ‌టంతోపాటు , కృష్ణ న‌ది ఒడ్డున వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు చేసి ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామ‌న్నారు. ప్రతి డివిషన్ లో సమస్యలు పరిష్కరించడానికి ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజ‌న్ అధ్య‌క్షుడు మోర‌బోయి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న , మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా, రాష్ట్ర తెలుగు మ‌హిళ ఉపాధ్య‌క్షురాలు షేక్ ఆషా, జిల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సోలంకి రాజు, నియోజ‌క‌వ‌ర్గ తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు సుకాసి స‌రిత‌, తెలుగుయువ‌త నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, ఐటిడిపి నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడు చైత‌న్య‌, న‌గ‌రాల కార్పొరేష‌న్ రాష్ట్ర డైరెక్ట‌ర్ సుఖాసి కిర‌ణ్, చ‌ల్లం రాజు స‌త్రం చైర్మ‌న్ ముదికొండ శివ‌, బుద్దావారి గుడి చైర్మ‌న్ పిళ్లా సుద‌ర్శ‌నం, వాణిజ్య విభాగం రాష్ట్ర నాయ‌కురాలు వ‌ల్ల‌భ‌నేని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, గొల్ల‌పూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మ‌న్ పాల మాధ‌వ‌, క్ల‌స్ట‌ర్ ఇన్చార్లు ప్ర‌భు, రామ‌య్య‌, డివిజ‌న్ నాయ‌కులు మోడీ వెంక‌ట రాజు, శివ‌, అచ్చిరెడ్డి, గుమ్మా బాలు, చెన్నుబోయిన నాగ‌రాజు, మూర‌బోయిన శ్రీను, కాక‌ర్ల కోటి, పూజ‌ల శ్రీనివాస‌రావు, తెలుగు మ‌హిళ నాయ‌కురాలు పెన్నా ఈశ్వ‌ర‌మ్మ ల‌తో పాటు త‌దితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *