Breaking News

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి షాబుఖారి ఉరుసు మహోత్సవ ఆహ్వానం

-ఇస్లాం సంప్రదాయ ప్రకారం సన్మానించి ఆహ్వానం అందజేసిన ఉరుసు కమిటీ సభ్యులు

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లిలో ఈ నెల 29, 30, 31 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుకి మంగళవారం అందజేశారు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ని ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. ఇస్లాం సంప్రదాయ ప్రకారం శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ హజ్రత్ సయ్యద్ షాబుఖారి బాబా ఉరుసు మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి తగు చర్యలు చేపడతామన్నారు. అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *