Breaking News

ఇన్నోవేషన్‌తో MSMEs, స్టార్టప్‌ల బలోపేతానికి NRDC–RTIH సంయుక్త వర్క్‌షాప్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్నోవేషన్ ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు (MSMEs) మరియు స్టార్టప్‌లను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మేధస్సు సంపత్తి హక్కులు (IPR), సాంకేతిక పరిజ్ఞాన బదిలీ మరియు వాణిజ్యీకరణ అంశాలపై అవగాహన వర్క్‌షాప్‌ను నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC), న్యూఢిల్లీ మరియు RTIH – రాజమహేంద్రవరం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆర్టిఐహెచ్ డైరెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు.
ఈ వర్క్‌షాప్‌ను 2025 డిసెంబర్ 30న, PGRS హాల్, కలెక్టరేట్, బొమ్మూరు, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా MSMEs మరియు స్టార్టప్‌ల సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వర్క్‌షాప్‌లో పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కులు, కాపీరైట్స్, భౌగోళిక సూచికలు (GI) వంటి మేధస్సు సంపత్తి హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, ఆవిష్కరణాత్మక సాంకేతికతల స్వీకరణను ప్రోత్సహించడం, పరిశోధనా సంస్థలు (R&D) మరియు పరిశ్రమల మధ్య సాంకేతిక వ్యాప్తి, వాణిజ్యీకరణకు సహకారం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
అదనంగా, పాల్గొనేవారికి మేధస్సు సంపత్తి హక్కులు, సాంకేతిక స్వీకరణ మరియు వాణిజ్యీకరణ అవకాశాలపై ప్రత్యక్ష మార్గదర్శనం అందించేందుకు NRDC ఆధ్వర్యంలో ప్రత్యేక IP & టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ క్లినిక్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టి ఐ హెచ్ నోడల్ అధికారి కె. సూర్య ప్రకాశ్ ఆధ్వర్యంలో సమావేశంనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు . ఈ వర్క్‌షాప్ MSMEs, స్టార్టప్‌లు, పారిశ్రామిక వేత్తలు, పరిశోధకులు మరియు ఆవిష్కర్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వై. మేఘా స్వరూప్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *