Breaking News

మార్చి నాటికి గృహ లక్ష్యాలు పూర్తి చేయాల్సిందే

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణ లక్ష్యాలు మార్చి నాటికి పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణంపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్ 3 గృహాలలో స్టేజ్ డివియేషన్ ఉన్నవాటిని గుర్తించి వాటిని సరిచేసి పనులు వేగవంతం చేయాలన్నారు. కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పునాదులు వద్ద నింపుటకు జిందాల్ సంస్థతో సమావేశం నుండే ఫోన్ లో మాట్లాడి ఫ్లై యాష్ సరఫరా చేయాలని తెలియజేయగా సంస్థ వెంటనే అంగీకారం తెలియజేసింది. ఆ సంస్థ నుండి నిబంధనలు మేరకు యాష్ పొంది సంబంధిత కాంట్రాక్టర్ లు తక్షణం పనులు పూర్తి చేయాలని అన్నారు. పురపాలక కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పూర్తి బాధ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి చేసిన గృహాల వద్ద కనీస అవసరాలు పూర్తి చేసి లబ్ధిదారులు వెంటనే గృహ ప్రవేశం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ లే అవుట్ లలో మౌళిక వసతుల కల్పనకు
అవసరాలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఇసుకకు ఎటువంటి ఇబ్బందులు లేవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల గృహాల నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో గృహాలు పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్ 3 క్రింద 30 వేల ఇళ్లు ఉన్నాయన్నారు. ఎక్కువ గృహాలకు ఫిల్లింగ్ చేయకుండా డివియేషన్ ఉన్నాయని గుర్తించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో 7,092 గృహాలు లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందని వివరించారు.

గుంటూరు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ఏటుకూరు గృహ నిర్మాణ లే అవుట్ లో విద్యుత్ సరఫరా అవసరం ఉందని, అంతర్గత రహదారులు వేయాల్సి ఉందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, గృహ నిర్మాణ సంస్థ కార్యనిర్వహక ఇంజనీర్ శంకర రావు, మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *