-ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హాజరు
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన పాల సేకరణ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ పాల సేకరణ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , ఏపీ స్టేట్ విజయా మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ నూతన పాల సేకరణ భవనాన్ని ప్రారంభించారు.
ఈ పాల సేకరణ భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.3.75 లక్షలు, కృష్ణ మిల్క్ యూనియన్ నుంచి రూ.0.50 లక్షలు మంజూరు కాగా, మొత్తం రూ.4,25,000 వ్యయంతో ఈ భవనం నిర్మాణం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గ్రామీణ పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడం, పాల ఉత్పత్తిదారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, కృష్ణా మిల్క్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, జనరల్ మేనేజర్ డాక్టర్ పారి, కృష్ణ మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఇంజం రామారావు, నెలకుదుతి నాగేశ్వరరావు, చిల్లకల్లు పాలశీతలీకరణ మేనేజర్ బోజంకి నరేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల గాంధీలతో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News