గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం కెవిపి కాలనీ, కోదండరామయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తీ చేయడం అతి ముఖ్యమని, పనుల జాప్యం వలన ప్రజల రాకపోకలతో పాటు చుట్టుపక్కల వారికి కూడా ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ప్రతి పనిని నిర్దేశిత గడువు మేరకు అయ్యేలా ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు భాధ్యత తీసుకోవాలన్నారు. సిసి రోడ్లు, డ్రైన్ల క్యూరింగ్ పై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. నిర్మాణ అనంతరం వ్యర్ధాలలను సదరు కాంట్రాక్టరే తొలగించాలన్నారు. కేవిపి కాలనీ మెయిన్ రోడ్ లో చేపట్టిన కల్వర్ట్, తదుపరి రోడ్ ఏర్పాటు కూడా పూర్తి అయినందున, తదుపరి లెవలింగ్ చర్యలు తీసుకోవాలని ఏఈని ఆదేశించారు. గడ్డిపాడు రైల్వే గేటు నుండి ఇన్నర్ రింగ్ రోడ్ లో సెంట్రల్ డివైడర్, రోడ్ వెంబడి మొక్కలు నాటాలని పార్క్ సిబ్బందిని, హోర్డింగ్స్, బోర్డ్ లను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శిల్పారామం దగ్గర పచ్చదనం పెంపుకు చేపట్టిన పనులను వేగంగా చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3 మార్గంలో రోడ్ కి ప్యాచ్ వర్క్ లు చేపట్టాలని ఏఈ, డిఈఈలను ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ ఎన్.బాలాజీ, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, డిఈఈలు వెంకటరమణ, రమేష్, ఎస్ఎస్ లు ఐజాక్, సాంబయ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News