Breaking News

జనవరి 11వ తేదీన కమ్మవారి సంక్రాంతి సంబరాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 11వ తేదీ విజయవాడ సమీపంలో పోరంకి నిడమానూరు రోడ్డులో మురళీ రిసార్ట్, శ్రీ ముత్తవరపు వెంకటేశ్వరరావుగారి ప్రాంగణంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కమ్మవారి సేవా సమితి కార్యవర్గం, కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఆర్గనైజింగ్ కమిటీ వారు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ వేడుకలో విశిష్ఠ అతిథిగా రాజ్యసభ సభ్యురాలు,మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరి, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ప్రపంచ చదరంగ విజేత కోనేరు హంపి పాల్గొననున్నారు. గౌరవ అతిథులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొననున్నారు .క్రీడల్లో ప్రఖ్యాతిగాంచిన పలువురిని సన్మానించనున్నారు. ఈ సంబరాలలో భాగంగా విందు, వినోదం, ఆటలు, పాటలు, అతిథుల ప్రసంగాలు, ఆత్మీయ సత్కారాలు, బహుమతి ప్రదానం ఉంటాయి. ప్రత్యేక ఆకర్షణలుగా పందెపు ఎడ్లు, పొట్టేళ్ళు, కోడి పుంజులు, పక్షులు మరియు వివిధ జంతువుల ప్రదర్శన, వీర నాట్యం, గరగలు, బుర్ర కథ, హరిదాసు మరియు గంగిరెద్దుల ప్రదర్శన.ఆటల పోటీలుగా మహిళలకు తంబోలా, హౌసీ నిర్వహిస్తారు. ఈ సంబరాలలో కమ్మవారు అందరూ కుటుంబాలతో సహా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో కమ్మవారి సేవా సమితి, గ్రేటర్ విజయవాడ కార్యవర్గం, కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ నన్నపనేని నాగేశ్వరరావు, గుమ్మడి రామకృష్ణ, ముత్తవరపు శివరామకృష్ణ, సూరపనేని స్వరూపరాణి, చనమోలు సురేష్, సూరపనేని కృష్ణారావు, పెద్ది ప్రఫుల్ల చంద్ర, ఉప్పలపాటి ప్రవీణ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *