Breaking News

గండి కోట ఉత్సవాలలో సందర్శకులకు ఆహ్లాదం తో పాటు వినోదం తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ…

-ఉత్సవాలకు స్థానికులు, రాష్ట్రేతర, జిల్లాయేతర పర్యాటకులు హాజరై.. జిల్లా ఆతిథ్యాన్ని స్వీకరించి విజయవంతం చేయండి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి

జమ్మల మడుగు/గండి కోట, నేటి పత్రిక ప్రజావార్త :
గండి కోట ఉత్సవాలలో సందర్శకులకు ఆహ్లాదం తో పాటు వినోదం తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రంగండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన భాగంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు

గండికోట ఉత్సవాల నిర్వహణ లో భాగంగా సందర్శకులకు మరింత వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే విధంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకాలైన సాంస్కృతిక సందర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకించి యువతకు, చారిత్రకారులకు, కళాకారులు, సాహితీ ప్రియులు, కథకులు, రచయితలకు, వాగ్గేయ కారులకు వారివారి అభిరుచులకు తగ్గట్టు చక్కటి కార్యక్రమాలను రూపకల్పన చేశామన్నారు. అంతేకాకుండా సాంస్కృతిక, గ్రామీణ క్రీడలు, సాహస (అడ్వెంచర్) క్రీడలు, గండికోట పెన్నా నదీ లోయలో బోటింగ్, రోప్ వే, కోట పరిసర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ వంటి సదుపాయాలు సందర్శకులను విశేషంగాఆకట్టుకోనున్నాయని తెలిపారు .

గండికోట చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా చూసేందుకు హెలికాప్టర్, ఎయిర్ బెలూన్, పారాచూట్ విహంగ పయనం ద్వారా కోట పరిసరాలు, ఎర్రమల కొండల అందాలు, మంద్రంగా ప్రవహించే పెన్నా నదీ ప్రవాహం, మైలవరం, గండికోట రిజర్వాయర్ ల బ్యాక్ వాటర్ సోయగాలు, కొండలపై గాలి మరలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకొనున్నాయనన్నారు. మన కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అనేక రకాలైన గ్రామీణ చేతి వృత్తి కళాకారుల రూపొందించిన ఉత్పత్తులు, హ్యాండ్లూమ్స్… ఇలా అన్ని రకాల సంప్రదాయ కళారూపాల ప్రదర్శన తో పాటు విక్రయ శాలలను ఏర్పాటు చేయడమైనది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉత్సవాలకు వచ్చే సందర్శకులకు స్థానిక రుచులతో పాటు వివిధ రకాలైన సాంప్రదాయ రుచులను అందించే ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సందర్శకులు రాత్రిపూట బస చేసే సౌకర్యం కల్పిస్తూ.. వివిధ రకాల సదుపాయాలతో టెంట్ హౌస్ లను ఏర్పాటు చేయడమైనది.

సందర్శకులకు వసతిలో ఎలాంటి కొరత లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నీరు, టెంపరెరీ టాయిలెట్స్, పారిశుద్ధ్యం, రవాణా సదుపాయం, వెహికల్ పార్కింగ్.. ఇలా అన్ని రకాల కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కో ప్రత్యేకమైన ఈవెంట్స్ షోతో పర్యాటకులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయడం జరిగింది. ప్రసిద్ధిగాంచిన కళాకారులైన నేపథ్య గాయని మంగ్లీ, రామ్ మిర్యాల, డ్రమ్స్ మెజీషియన్ శివమణి.. మొదలైన కళాకారులచే ఒక్కో రోజు ఒక్కో మేజర్ ఈవెంట్ షోను నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరించనునున్నాం. జిల్లా సాంస్కృతిక చారిత్రక పర్యాటక వైభవాన్ని గండికోట గ్రాండ్ కెనాన్ వైభవాన్ని ప్రపంచ స్థాయిలో ఆకర్షించేలా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారి ఇలాంటి పర్యాటక శోభను గండికోటలో నిర్వహించడం.. కడప జిల్లా, ఈ ప్రాంత వాసులకు ఒక చక్కటి అవకాశంగా భావించి.. ఉత్సవాలు నిర్వహించే మూడు రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సందర్శకులు విరివిగా తరలిరావాలని కోరడమైనది.

ఈ ఉత్సవాలకు గండికోట పరిసర ప్రాంతాల స్థానికులు, రాష్ట్రేతర, జిల్లాయేతర పర్యాటకులు గండికోట ఉత్సవాలకు హాజరై.. ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *