Breaking News

సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనం ఆవ‌కాయ్‌..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతోత్సవాల్లో భాగంగా చివ‌రిరోజు కృష్ణాతీరంలో ముగింపు కార్య‌క్ర‌మాలు క‌నువిందు చేశాయి. చౌరాస్తా వారిచే సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌, న‌ట‌సార్వ‌భౌమ ఎన్‌టీఆర్‌: న‌ట‌నా విశ్వ‌రూపానికి నివాళి పేరుతో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం అల‌రించింది. మహానటుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని, ఆయన నటనలో ప్రదర్శించిన విశ్వవ్యాప్త శైలిని స్మరించుకుంటూ నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఎన్‌టీఆర్ గారి సినీ జీవితం, నటనలో ఆయన విశిష్ట‌త‌, ప్రత్యేక పాత్రలు, ఆయనతో సంబంధం ఉన్న సినీ ప్ర‌ముఖులు అనుభవాలు వివరించబ‌డ్డాయి. సినీ ప్రపంచంలో ఎన్‌టీఆర్ గారి ప్ర‌త్యేక స్థానం, నటనలో విశిష్టత, సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సంద‌ర్భంగా స్మ‌రించుకోవ‌డం జ‌రిగింది. సింగర్ జావేద్ అలీ సంగీత కచేరి ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. ఒక మధురానుభూతుల సాయంత్రాన్ని అందించింది. జావేద్ అలీ గాత్రంలో ప్రతీ స్వరం హృదయాలను తాకింది. ఆయ‌న పాడిన పాట‌లు రసభరిత రాగాల సమ్మేళనంగా సాగింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *