Breaking News

రైతులంతా సంఘటితంగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాలి… : రతన్ ప్రకాష్ వటల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీగంధం సాగు చేసే రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని సెంట్రల్ శాండల్ వుడ్ కమిటీ చైర్మన్ రతన్ ప్రకాష్ వటల్ తెలిపారు. నివేదిక అమలకు రైతులంతా సంఘటితంగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాలని సూచించారు. నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

గుణదలలోని పార్క్ హయత్ హోటల్లో ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం దారుల సమాఖ్య జాతీయ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర చతిస్గడ్ తమిళనాడు కు చెందిన రైతులు ఈ సదస్సులో పాల్గొని వారి సమస్యలను సభికుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం సెంట్రల్ శాండల్ వుడ్ కమిటీ చైర్మన్ రతన్ ప్రకాష్ వటల్ మాట్లాడుతూ శ్రీగంధం సాగు చేసే రైతులు అనేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్య కేంద్ర ప్రభుత్వం శాండిల్ వుడ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తాము దేశవ్యాప్తంగా శ్రీగంధం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా ఒక నివేదిక రూపొందించడం జరిగిందని తెలిపారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీగంధం చెట్ల పెంపకం దారులు సంఘటితంగా ఉండి ఆ నివేదికను అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలవాలని అన్నారు. కేంద్రం కూడా తాము ఇచ్చిన నివేదికను అమలుపరిచే విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గారపాటి పూర్ణచంద్రరావు, కర్ణాటక రైతు సమాఖ్య అధ్యక్షుడు కేంపారెడ్డి అరుణ నారాయణ మాట్లాడుతూ ఎర్రచందనం శ్రీగంధం చెట్లను రక్షించుకోవడం కష్టతరంగా మారిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సదస్సులో పలువురు రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *