-ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదకరంగా నివసించాలన్నదేముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం…
-రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్మి నాని
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలలో ప్రజలకు సురక్షితమైన, మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ వంద రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టనడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారులు వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), రాష్ట్ర రవాణా సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు.
బుధవారం పామర్రు ప్రధాన కూడలి నందు స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జగనన్న స్వచ్చ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా స్థాయి వందరోజులు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లా కలెక్టరు జె. నివాసం ముఖ్యఅతిధులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కైకలూరు, అవనిగడ్డ, తిరువూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, సింహాద్రిరమేష్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డా . వై.యస్ . రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదకరంగా నివసించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం క్లాప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను అందించారన్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వాహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేదిశగా వినూత్న విధానాలను రూపొందించుకుంటూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. పట్టణాలు, గ్రామాలు స్వచ్చంగా ఉండాలని, నీరు – గాలి పోల్యూషన్ లేకుండా స్వచ్చంగా ఉంచేందుకు పరిశరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సీయం జగన్మోహన్ రెడ్డి గొప్పకార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. పామర్రు నియోజకవర్గంలో శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ కు 32 వేల ఓట్లు మెజారిటీనిచ్చి గెలిపించారన్నారు. మీరించిన భాద్యతతో గత నాయకులకంటే ప్రజాసమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తు ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేసేందుకు తమ వంతు సహాకారం ఉంటుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.
రాష్ట్ర రవాణా, సమచార పౌరసంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంట్రామయ్య(నాని) మాట్లాడుతూ ఊరు బాగుంటేనే అందరి ఆరోగ్యాలు బాగుంటాయనే లక్ష్యంతో రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి కాలుష్య రహిత సమాజాన్ని తీర్చి దిద్దేందుకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జగనన్న స్వచ్చ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా తడి పొడి చెత్తను తరరించేందుకు గ్రీన్ అంబాసిడర్లు ను నియమించారన్నారు. వారు ప్రతిరోజు ఇంటింటింకీ వచ్చి చెత్తను సేకరిస్తారని వారికి ప్రతి కుటుంబం సహకరించారన్నారు. ఈ మేరకు చేత్త సేకరణకు గాను జిల్లాలో పెద్ద ఎత్తన వాహనాలు మంజూరు చేసి పంపించారన్నారు.
కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టే జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్నిస్పూర్తిగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు వారి గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దాన్నారు. తడి పొడి చెత్తను సేకరించేందుకు ప్రతి గ్రామంలో గ్రీన్ అంబాసిడర్ లను నియమించామన్నారు. జిల్లాలో ఆయా పంచాయితీలు, పట్టణాలు, నగరాలకు అనువుగా చెత్త సేకరణకు ట్రైసైకిళ్లు, ఆటోలు, మినీ వ్యాన్లు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాకు 99 వాహనాలను మంజూరుచేయగా తొలి దశలో ఆయా గ్రామ పంచాయితీలకు 30 వాహనాలను పంపించామన్నారు.
స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ పామర్రు వేదికగా జిల్లా స్థాయి జగనన్న స్వచ్చసంకల్పం వందరోజుల బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత రెండున్నరేళ్లుగా లబ్దిదారులకు అనేక సంక్షంమ కార్యక్రమాలను అందిస్తు సీయం జగన్నోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సంక్షేమపథకాలను అమలు చేసిందన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నలక్ష్యంతో నేడు జగనన్న స్వచ్చసంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.
జిల్లా పరిషత్ సీఇవో సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం లో బాగంగా ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు చొప్పున నీలం , ఆకుపచ్చ , ఎరుపు రంగు చెత్త బుట్టలను పంపిణీ చేసి వంద శాతం వేరు చేసిన చెత్తను సేకరించడం జరగుతుందన్నారు. చెత్తను ఇంటివద్దనే కంపోస్టు చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుందని, ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి చెత్త , పొడి చెత్త, ప్రమాదకర వ్యర్ధాలను గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజి ట్రాన్స్ ఫర్ సెంటర్లకు తరలిస్తారన్నారు. వీటి ద్వారా కంపోస్టు ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరలకై వినియోగించడం జరుగుతుందని తేలిపారు.
ఈసందర్బంగా మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జిల్లా కలెక్టరు జె. నివాస్, జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్ శివశంకర్ శాసనసభ్యులు అధికారులు జగనన్నస్వచ్చ సంకల్పం గోడ పత్రికలను ఆవిష్కరించి, అనంతరం చెత్త సేకరణ వాహనాలకు జెండా ఊపీ ప్రారంభించారు.
కార్యక్రమంలో కైకలూరు, అవనిగడ్డ, తిరువూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, సింహాద్రి రమేష్ లు, జిల్లా పరిషత్ సీఇవో సూర్య ప్రకాశరావు, డీపీజో జ్యోతి, డిఎల్పీవో నాగిరెడ్డి, తాహశీల్థారు సురేష్, యంపీడీవో రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News