జగనన్న ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం లేకుండా అధికారులు లక్ష్యాలను పూర్తి చెయ్యాలి…

-మండల స్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తారు..
-ఇంకా మెరక చేయాల్సిన ఇళ్ల స్థలాల్లో త్వరితగతిన మెరక పనులు పూర్తి చెయ్యాలి..
-జాయింట్ కలెక్టరు (ఆసరా) మెహన్ కుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న లే అవుట్ల లో లబ్దిదారుల ఇళ్ల నిర్మాణాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలను పూర్తి చెయ్యాలని జాయింట్ కలెక్టరు(ఆసరా) కె. మోహన్ కుమార్ అన్నారు.
స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బుధవారం డివిజన్ లోని తాహశీల్థార్లు, యంపీడీవోలు, హౌసింగ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో డివిజన్లో నిర్మిస్తున్న జగనన్న గృహనిర్మాణాల పురోగతిపై జాయింట్ కలెక్టరు మోహన్ కుమార్ హౌసింగ్ పీడీ రామంచంద్రన్, ఆర్డీవో శ్రీనుకుమార్ తో కలసి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ అర్బన్ తో పాటు డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో 322 లేఅవుట్లో మొదటి దశలో 22,154 గృహాలను నిర్మించాలనే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 1208 ఇళ్లు వివిద నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించకుండ అధికారులు లక్ష్యాలను పూర్తి చెయ్యాలన్నారు. లబ్దిదారుల ఇళ్ల నిర్మాణంలో ఇసుక, సిమ్మెంట్, ఐరన్, కంకర(చిప్స్) ఇతర మెటీరీయల్ ను 50 శాతం ఆయా మండల కేంద్రాల్లోని, మరో 50 శాతం స్థానికంగా ఉన్న సచివాలయాల్లో స్టాక్ ఉంచేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేకంగా ఇళ్ళ నిర్మాణంలో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ ఏఈలు భాద్యతో మెటీరియల్ ను లబ్దిదారుల ఇళ్ల నిర్మాణాలకు అందించాలన్నారు. ఈ సందర్భంగా మండల వారీ లే అవుట్ల లో చేపట్టిన గృహనిర్మాణాల పురోగతి పై ఆయా మండల యంపీడీవో, హౌసింగ్ ఏఈ, డీఈలతో సమీక్షించారు. గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించడమే కాక, సిమెంట్, స్టీల్ వంటి మెటీరియల్స్ సబ్సిడీ ధరపై లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తున్నదని, ఈ అంశాలను లబ్దిదారులకు తెలియజేసి ఇళ్ళు నిర్మించుకునేలా చైతన్య పరచాలన్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ. 50 వేలు రూపాయలు మంజూరు అయ్యే విధంగా యంపీడీవో, ఏపీఓలు శ్రద్ద తీసుకోవాలన్నారు. వాటర్, విద్యు సౌకర్యం లేని లేఅవుట్లలో సంబందిత విద్యత్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను సమీక్షల్లో భాగస్వామ్యులను చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అక్టోబరు చివరినాటికి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచి ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. లబ్దిదారులు గృహనిర్మాణాలపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించడంతో పాటు క్షేత్ర స్థాయిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తామన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 172 లే అవుట్లలో 6100 ఇల్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 605 గృహాలు వివిద నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో 84లే అవుట్లలో 9808 ఇల్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 359 గృహాలు, పామర్రు నియోజకవర్గంలోని పామర్రు, పెదపారుపూడి మండలాల్లోని 66 లేఅవుట్లలో 6246 ఇల్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 244 గృహాలు వివిద నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టరు జె. నివాస్ మరియు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డివిజన్ పరిదిలో మొదటి ఫేజ్ గృహనిర్మాణ లక్ష్యాలను సజావుగా పూర్తి అయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జాయింట్ కలెక్టరు(ఆసరా)మోహన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పీడీ రామచంద్రన్, ఆర్డీవో శ్రీను కుమార్, ఆర్డీవో కార్యాలయపు ఏవో స్వామినాయుడు, హౌసింగ్ డీఈలు రమేష్ బాబు, రామోజీ నాయక్, ఆదినారాయణ, తొమ్మిది మండలాల తాహశీల్థార్లు, యంపీడీవోలు, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఎన్ఆర్ఈ జీఎస్ ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *