తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ని మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిశారు. అన్నమయ్య జిల్లాలో సంప్రదాయంగా కొనసాగుతున్న టెర్రికోటా (మట్టి శిల్పకళ)కు ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… టెర్రికోటా కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ముడి సరుకుల సరఫరా, మార్కెటింగ్ సదుపాయాలు, రాష్ట్ర-జాతీయ స్థాయి ప్రదర్శనలు, ప్రభుత్వ కొనుగోలు విధానాలలో ప్రాధాన్యం కల్పిస్తే కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు. టెర్రికోటా హస్తకళను అన్నమయ్య జిల్లాకు ప్రత్యేక గుర్తింపుగా అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బెజవాడ దినేష్, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చిన్న రాయల్, తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పోతుల సాయినాథ్, మదనపల్లె ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News