Breaking News

శాఖా పరంగా స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలోనే పరిష్కరించి ధరఖాస్తుదారునికి న్యాయం చెయ్యాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం స్పందనలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందించాలన్నారు. తమ పరిధిలోని కాని అర్జీలను ఉన్నాతాధికారులకు పంపించి పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టాలన్నారు. కోరోనా పోయిందిలే అని ఎవరూ అశ్రద్దగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కరోనా ప్రభలకుండా అప్రమత్తతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్కలు ధరించడం, శానిటేషన్ వినియోగం, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిఎల్పీవో నాగిరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ. గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు

-గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం…ఆందోళన పడకండి! -జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం -ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *