Breaking News

అమరావతి రాజధాని నగర పరిధిలో అనధికార నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపుపై సిఆర్‌డీఏ నుంచి ముఖ్యమైన హెచ్చరిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఆధీనంలోని రాజధాని అమరావతి నగర పరిధిలో అనుమతి లేకుండా చేసే నిర్మాణాలు, ఆక్రమణలు, ఆమోదించిన ప్లాన్‌కు విరుద్ధంగా భూమి లేదా భవనాల వినియోగం పూర్తిగా నిషేధమని ప్రజలకు తెలియజేయడమైనది. ప్రణాళికాబద్ధమైన రాజధాని అమరావతి నగర అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన చట్టపరమైన నిబంధనలు ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలని APCRDA ఈ మేరకు హెచ్చరిస్తోంది. APCRDA చట్టం–2014లో పొందుపరచబడిన నిబంధనల ప్రకారం, అనుమతి లేకుండా చేపట్టే నిర్మాణాలపై రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన భూమి విలువలో 20 శాతం వరకు జరిమానా విధించబడుతుంది. ఈ విధమైన ఆక్రమణ చర్యలు కొనసాగినట్లైతే, నిబంధనలు పాటించే వరకు ప్రతిరోజూ భూమి విలువలో 1 శాతం వరకు సదరు వ్యక్తులపై అదనపు జరిమానా విధించబడుతుంది. రాజధాని నగరంలో ప్రణాళికాయుత అభివృద్ధి చర్యల అమలు కోసం కఠిన చర్యలు తీసుకుంటామని APCRDA హెచ్చరికలు జారీ చేస్తోంది.

అదేవిధంగా, ప్రభుత్వ భూములు లేదా APCRDA ఆధీనంలో ఉన్న భూములు, రహదారులు, ఖాళీ స్థలాలు, ప్రజా ప్రదేశాల్లో ముందస్తు అనుమతి లేకుండా కంటైనర్లు, బండ్లు, కియోస్కులు, తాత్కాలిక షెడ్లు లేదా ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేస్తే ముందస్తు నోటీసు లేకుండానే తొలగిస్తామని తెలియజేయుచున్నాము. వాటి యొక్క తొలగింపు, రవాణా, నిల్వ & ఇతర ఖర్చులు సంబంధిత ఆక్రమణదారుల నుంచే వసూలు చేయబడతాయని తెలియజేయుచున్నాము. ఆక్రమణల తొలగింపు కార్యకలాపాలు నిర్వర్తించు అధికారులు తమ విధులు నిర్వహించే సమయంలో అడ్డంకులు కలిగిస్తే సంబంధిత చట్టాల ప్రకారం శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయుచున్నాము. ప్రజారాజధాని అమరావతి యొక్క ప్రణాళికాబద్ధ అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రజలు, రైతులు, వ్యాపారులు అందరూ నిబంధనలు పాటించి APCRDA సంస్థ యొక్క పరిపాలన కార్యకలాపాలకు సహకరించాలని విజ్ఞప్తి చేయుచున్నాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *