Breaking News

అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం

-95,598 మంది పరీక్షకు హాజరు
-వాంబే కాలనీలో పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర (FLNAT) ఫైనల్ పరీక్ష ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 97,047 మంది అభ్యర్థులను అక్షర ఆంధ్ర యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయగా, అందులో 95,598 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడలోని వాంబే కాలనీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరుగుతున్న తీరును అధికారులతో కలిసి పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చదవడం, రాయడం, ప్రాథమిక గణితం మాత్రమే కాకుండా డిజిటల్ లావాదేవీలపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా జీవన నైపుణ్యాలు పెంపొందడంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని**, దాని ద్వారా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య నోడల్ ఆఫీసర్ జి. ప్రసాదరావు, యూసీడీ పీవో ఎం.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *