Breaking News

పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్న ఆస్తి, నీటి, సీవరేజ్ పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధి సహకరించాలని, బకాయిదారులకు పన్ను బకాయిలపై సమాచారం అందించేందుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ట్యాక్స్ కలెక్షన్ సెంటర్ దగ్గర ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని, అలాగే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863 2345103 కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ బుధవారం కాల్ సెంటర్ ని, ట్యాక్స్ కలెక్షన్ సెంటర్ లో హెల్ప్ డెస్క్ ని పరిశీలించి పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై మేనేజర్ కి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏక మొత్తంలో పన్ను చెల్లించిన వారికి వడ్డీపై 50 శాతం రాయితీ ఇచ్చిందని, ఇప్పటికే రాయితీ ప్రకారం చెల్లించాల్సిన పన్ను వివరాలతో కూడిన స్లిప్స్ కూడా అందిస్తామన్నారు. పన్ను చెల్లించడానికి అనువుగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, బృందావన్ గార్డెన్స్ లోని సర్కిల్ కార్యాలయంతో పాటుగా భారత్ పేట సచివాలయం (140), ఎల్ఆర్ కాలనీ మెయిన్ రోడ్ లోని సచివాలయం (53), వసంతరాయపురంలోని సచివాలయం (148), గోరంట్ల వినాయకుని గుడివద్ద సచివాలయం (183), గుజ్జనగుండ్లలోని సచివాలయం (106), సుద్దపల్లి డొంకలోని సచివాలయం (26)ల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటర్ల వద్ద పన్ను చెల్లింపుదారులకు సౌకర్యార్ధం త్రాగునీరు, టెంట్లను ఏర్పాటు చేశామన్నారు.
ఉగాది, రంజాన్ సెలవు రోజులైనప్పటికీ ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాక్స్ కలెక్షన్ సెంటర్లు పని చేస్తాయి…
గురువారం, శుక్రవారం పండగ సెలవు రోజులైనప్పటికీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు పనిచేస్తాయని బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *