Breaking News

సేంద్రియ కూరగాయలతో ఆరోగ్యమైన హ్యాపీ సండే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ సౌజన్యంతో One Earth – One LIFE తరపున హ్యాపీ సండే లో భాగంగా “ఫార్మర్ టు కన్జ్యూమర్ ” కార్యక్రమం నగర ప్రజలకు ఒక ఆరోగ్యకరమైన మార్గదర్శకంగా నిలవాలని ఉద్దేశంతో ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రసాయన రహిత (ఆర్గానిక్) కూరగాయలను నేరుగా రైతుల నుండి వినియోగదారులకు అందించడం. మధ్యవర్తులు లేకుండా, రైతులకు సరైన ధర అందిస్తూ, వినియోగదారులకు తాజా, నాణ్యమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈరోజుల్లో రసాయనాలతో పండించిన ఆహారం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సహజ పద్ధతుల్లో పండించిన కూరగాయలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. “ఆహారమే ఔషధం” అనే భావనను ప్రతి ఒక్కరికి చేరవేయడమే మా సంకల్పం. అదేవిధంగా, చిన్న మరియు సన్న రైతులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమంలో ముఖ్య భాగం. రైతు కష్టం విలువైనదిగా గుర్తిస్తూ, వారికి నేరుగా మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. One Earth – One LIFE (టెర్రస్ గార్డెన్) తరపున నగర ప్రజలను మిద్దె తోటల వైపు ప్రోత్సహించడంలో కూడా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగు. ప్రతి ఇంట్లో ఒక చిన్న తోట ఉంటే, కుటుంబానికి అవసరమైన కూరగాయలను స్వయంగా పండించుకోవచ్చు. ఇది ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ప్రకృతికి దగ్గరగా జీవించే అవకాశాన్ని ఇస్తుంది. ఈరోజు ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర ప్రజలు మంచి స్పందన తెలిపారు. రైతులు తీసుకొచ్చిన ఆర్గానిక్ కూరగాయలను ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ లీలా కుమారి మాట్లాడుతూ, రసాయన రహిత ఆహారం తీసుకోవడం ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని తెలిపారు. చిన్న స్థలంలో కూడా మిద్దె తోటలను ఏర్పాటు చేసుకొని స్వయంగా కూరగాయలు పండించుకోవాలని, పిల్లలకు కూడా ప్రకృతి మీద ప్రేమ పెంచాలని సూచించారు. అలాగే రైతులకు నేరుగా మద్దతు ఇవ్వడం ద్వారా సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని వివరించారు. ప్రకృతికి దగ్గరగా జీవించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. “రైతుకు మద్దతు – మన ఆరోగ్యానికి భరోసా” అనే నినాదంతో ముందుకు సాగుదాం. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ విజయ్, మద్దిరాల కమలాకరరావు, కె.హారతి, రాజేశ్వరి, వసంత, తూనుగుంట్ల శేఖర్, వెంకటేష్ మరియు రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *