Breaking News

రాష్ట్రానికి ఆర్థిక భారం ఉన్నా.. పెన్షన్ల పంపిణీ ఆగదు

-14వ డివిజన్లో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం 1వ తేదీన పెన్షన్లు అందించడంలో విఫలమైందని, రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నప్పటికీ లబ్ధిదారులకు పెన్షన్లను అందించడం కూటమి ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనమని, ప్రతి నెల 1వ తేదీనే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోంది.” అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని 14వ డివిజన్, రామ్ – రహీమ్ కాలనీలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నగర కమిషనర్ కె,మయూర్ అశోక్, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రిడాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ, వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర అర్హులైన వారికి సమయానికి పారదర్శకంగా కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ మొత్తాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో అధిక మొత్తంలో పెన్షన్లు అందిస్తున్నామని, దివ్యాంగులకు నెలకు రూ.6వేలు, పూర్తిగా వికలాంగులైన వారికి రూ.15వేల వరకు పెన్షన్ అందిస్తున్నామని వివరించారు. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు ప్రాంతాల్లో కలిపి సుమారు రూ.25 కోట్ల విలువైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశామన్నారు. అదేవిధంగా 86 మంది కొత్త లబ్ధిదారులకు కూడా పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగర పరిధిలో 57,090 మందికి 26 రకాల పెన్షన్లను 1203 మంది ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించామని తెలిపారు.
శాసన సభ్యులు నసీర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే పెన్సన్ అందించడం ద్వారా పేదల కళ్లల్లో అనందం కనిపిస్తుందన్నారు. ప్రతి నెలా రూ.11 వందల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాల అమలులో చరిత్ర సృష్టిస్తుందన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఈ నెల నూతనంగా 36 పెన్షన్ ల మంజూరు జరిగిందని తెలిపారు.
కార్యక్రమమంలో మెప్మా పిడి విజయలక్ష్మీ, జిఎంసి అదనపు కమిషనర్ (ఇంచార్జి) సాంబశివరావు, ఉపా సెల్ పిఓ సింహాచలం, బిజెపి జిల్లా అధ్యక్షులు సిహెచ్.తిరుపతిరావు, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *