Breaking News

బిజెపి వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాం…. : కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలో ఉన్న అభిజిత్ సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించాడు. కోట్లాదిమంది యువకులు, ప్రజలు దీనికి మద్దతు ప్రకటిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీలో చేరకపోతే అభిజిత్ ను చంపేస్తామంటూ బిజెపి బెదిరించే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఉండదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. 2014 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని మోడీ ప్రకటించారు. కానీ గత 12 ఏళ్లుగా ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. మోడీ సర్కార్ రైతులకు, గ్రామీణ ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆ రకంగా వ్యక్తం చేయగా, సోషల్ మీడియాలో కోట్లాదిమంది స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. అసలు ఎందుకు ఇంత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతావుందో, వ్యతిరేకత ఎందుకు వచ్చిందో, వారి సమస్యలపై చర్చ జరగకుండా అమెరికాలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో పార్టీ పెట్టిన అభిజిత్ ను చంపుతామని బెదిరించటం అత్యంత దుర్మార్గం.

బిజెపి విపక్ష పార్టీల నేతలపై కేసులు పెడతామని బెదిరిస్తూ, వారిని బిజెపిలో చేర్చుకున్న ఘటనలు అనేకం. అక్రమార్కులు, అవినీతిపరులు బిజెపి కండువా కప్పుకోగానే పవిత్రులయిపోతారు. ఇప్పుడు మరొక మెట్టెక్కి బిజెపిని విమర్శించే వాళ్ళను కూడా బిజెపిలో చేరాలని ఒత్తిడి చేస్తూ, బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఉప చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. బిజెపి వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాం.

భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందంటానికి ఇంతకంటే దృష్టాంతరం అవసరం లేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. కోర్టులను ఉల్లంఘిస్తోంది. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం వంటగలుపుతోంది. హిందూ మత ఉన్నదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వ పాలన సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలకు మోడీ తలవంచి సలాం చేస్తుండగా, భారతదేశంలో బెదిరింపు రాజకీయాలకు తెరలేపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బిజెపి బెదిరింపులను ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని, ప్రజలంతా ఐక్యంగా తిప్పి కొట్టాలని కోరుతున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *